ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

selfish horse: స్వార్థమైన గుర్రము

ABN, First Publish Date - 2023-07-28T03:53:50+05:30

ఒక వర్తకుడుండేవాడు. అతని పేరు సోమయ్య. అతని దగ్గర ఒక కుక్క, గాడిద, గుర్రము ఉండేవి. వాటిని ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. మంచి ఆహారం తినిపించేవాడు.

ఒక వర్తకుడుండేవాడు. అతని పేరు సోమయ్య. అతని దగ్గర ఒక కుక్క, గాడిద, గుర్రము ఉండేవి. వాటిని ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. మంచి ఆహారం తినిపించేవాడు. కుక్కకు మాత్రం ఏ పని ఉండేది కాదని.. గుర్రం అనుకునేది. ఎవరి పాత్ర వాళ్లది అనేది గాడిద. అయితే గుర్రం మాత్రం తానే గొప్ప అనుకునేది. నా మీద స్వారీ చేస్తే ఎవరైనా సరే తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుతారు. మీ వల్ల కాదు.. అంటూ కుక్కనూ, గాడిదనూ అనేది. అయితే అవి వినీ వినకుండా ఉండేవి.

గాడిదమీద బియ్యం, ఉప్పు, ఇతర సామాగ్రిని పలు ప్రాంతాలకు వ్యాపారం చేసేవాడు. ఎంత కష్టపడినా గాడిదకు గుర్తింపు ఇచ్చేవాడు కాదు. గుర్రం మీద స్వారీ చేస్తూ యజమాని వచ్చేవాడు. గాడిదకు మాత్రం కోపం చిర్రెత్తుకొచ్చేది. అయినా ఏమీ అనలేని పరిస్థితి. కుక్క వెనకాల వచ్చేది. ఒక రోజు గాడిదకు నీరసంగా ఉన్నది.. కొంత దూరం నడిచాక ఇక బరువు మోయలేనని చెప్పింది. కాస్త నువ్వు సాయం చేస్తావా? అని అడిగింది. ‘నీ పనే బరువు మొయ్యడం.. అందుకే నీకు తిండి పెడుతున్నాడు. తిండి దండగ’ అన్నది గుర్రం. గాడిద బాధతో ముందుకెళ్లింది. అయితే తన చేత కాకపోవటం వల్ల గాడిద అక్కడిక్కడే కూర్చుండిపోయింది.

బియ్యం, ఉప్పు మూటలన్నీ కిందపడ్డాయి. దీంతో యజమానికి కోపం వచ్చింది. గాడిదను కొట్టాడు. గాడిద లేవలేకపోతోంది. సుష్తు చేసిందని అర్థమైంది. ఇక ఇంత ధాన్యాన్ని గ్రామానికి తీసుకెళ్లకపోతే అంతే సంగతులు అనుకున్నాడు వ్యాపారి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. అంతటి ధాన్యాన్ని, ఉప్పుమూటల్ని గుర్రం మీద వేశాడు. గుర్రం మూలుగుతూనే ముందుకు అడుగులేసింది. ఇంత బరువును మోయటానికి గాడిదకే సరిపోతుంది. ఈ గాడిద కష్టాలు తన వల్ల కావని మనసులో అనుకుంది. గాడిద గొప్పతనం తెలిసింది. దీంతో మరుసటి రోజునుంచి గాడిదను, కుక్కను ఏమీ అనలేదు.

Updated Date - 2023-07-28T03:53:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising