ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Akbar-Birbal-Crows : అక్బర్‌- బీర్బల్‌- కాకులు

ABN, First Publish Date - 2023-08-12T03:34:53+05:30

అక్బర్‌ ఆస్థానంలో బీర్బల్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉండేది. అక్బర్‌తో బీర్బల్‌కు సాన్నిహిత్యం కూడా ఉండేది. దీనిని చూసి సహించలేని కొందరు వీరిద్దరిని వేరు చేయాలని ప్రయత్నిస్తూ ఉండేవారు. ఒక రోజు అక్బర్‌ ఆస్థానంలో ఉండగా-

అక్బర్‌ ఆస్థానంలో బీర్బల్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉండేది. అక్బర్‌తో బీర్బల్‌కు సాన్నిహిత్యం కూడా ఉండేది. దీనిని చూసి సహించలేని కొందరు వీరిద్దరిని వేరు చేయాలని ప్రయత్నిస్తూ ఉండేవారు. ఒక రోజు అక్బర్‌ ఆస్థానంలో ఉండగా- దూరంగా కాకి కూసింది. వెంటనే ఆయన మనసులో ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ‘‘మన నగరంలో ఎన్ని కాకులు ఉన్నాయో లెక్కించి చెబితే వారికి వంద బంగారు కాసుల బహుమానం ఇస్తా’’ అని ప్రకటించాడు. వెంటనే బీర్బల్‌ లేచి- ‘‘మహారాజా! మన నగరంలో నాలుగువేల మూడు వందల పన్నెండు కాకులు ఉన్నాయి’’ అని సమాధానమిచ్చాడు. దీనిని ఒక అవకాశంగా భావించి బీర్బల్‌ ప్రత్యర్థులు - ‘‘రాజా! బీర్బల్‌ అబద్ధాలు చెబుతున్నాడు. కాకుల సంఖ్య కచ్చితంగా ఎవరైనా చెప్పగలరా.. మిమల్ని మోసం చేస్తున్న బీర్బల్‌ను శిక్షించండి’’ అని కోరారు. అక్బర్‌ ఎన్ని సార్లు అడిగినా- బీర్బల్‌ - ‘‘మహారాజా! మీరు మీ మనుషులను పంపి లెక్కించుకోండి’’ అనటం మొదలుపెట్టాడు. చివరు ఏమి చేయలేని పరిస్థితిలో అక్బర్‌ సభను వాయిదా వేసి వెళ్లిపోయాడు. సాయంత్రం బీర్బల్‌ను తన మందిరానికి పిలిచి - ‘‘ఆ లెక్క అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగావు?’’ అని అడిగాడు. అప్పుడు బీర్బల్‌ - ‘‘మహారాజా! కాకుల లెక్క నాకూ తెలియదు. ఒక వేళ మీరు మనుషులను పంపి లెక్కపెట్టారనుకుందాం. అప్పుడు తక్కువ ఉంటే- వాటి బంధువుల దగ్గరకు వెళ్లాయని చెప్పేవాడిని. ఎక్కువ ఉంటే- బయట కాకులు వచ్చాయని చెప్పేవాడిని’’ అన్నాడు. బీర్బల్‌ తెలివికి అక్బర్‌ సంతోషించి - వంద బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు.

Updated Date - 2023-08-12T03:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising