Ants pigs: మీకు తెలుసా?
ABN, First Publish Date - 2023-03-27T23:03:42+05:30
పెద్దచెవులు, పొడవైన ముఖభాగం ఉండే ఈ జంతువులను ఆడ్‌వార్క్స్ అంటారు. చూడటానికి వరాహాల్లా ఉంటాయి. కుందేలులాంటి చెవులు. కంగారూలాంటి తోక వీటికి ఉంటుంది.
పెద్దచెవులు, పొడవైన ముఖభాగం ఉండే ఈ జంతువులను ఆడ్‌వార్క్స్ అంటారు. చూడటానికి వరాహాల్లా ఉంటాయి. కుందేలులాంటి చెవులు. కంగారూలాంటి తోక వీటికి ఉంటుంది. ఆడ్‌వార్క్స్ అంటే ఆఫ్రికా భాషలో ‘ఎర్త్ పిగ్’ అని అర్థం. దీన్ని ‘యాంట్స్ పిగ్’ అని కూడా అంటారు. ఇది మట్టిని తవ్వి భూమిలో నివసిస్తుంది. ఇవి కనీసం 30 లేదా 40 ఫీట్ల లోతు, 13 మీటర్ల పొడవు వరకూ తవ్వుతాయి. లోపలికి వెళ్లటానికి, బయటకు వెళ్లటానికి రెండు లేదా మూడు దారులుంటాయి.
ఇవి తవ్విన గుంతల్లోంచి బయటకి వెళ్లినపుడు గుడ్లగూబలు, వైల్డ్‌డాగ్స్, పాములు వెళ్లి చేరుకుంటాయి.
డచ్ వాళ్లు ఆఫ్రికాలో దీన్ని 17 వ శతాబ్దంలో చూశారు. వీటి శిలాజాలు డైనోసార్ల సమయంలోనివి అంటే దాదాపు 65 మిలియన్ల కితంవని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
ఆఫ్రికాలోని పచ్చిక బయళ్లు, పొదలు, కొండ ప్రాంతాల్లో ఇవి అధికంగా నివసిస్తాయి. వీటి గ్రాహకశక్తి అద్భుతం. చాలా దూరంలో ఇతర జంతువులు లేదా మనుషులు ఉంటే గుర్తుపడతాయు.
వీటి పొడవైన నాలుకతో లోపల పడిన విత్తనాలను తింటాయి. పండ్లు తింటాయి. ఒక రాత్రిపూట ఇవి కనీసం 50 వేల చీమలను తింటాయి. చీమలంటే వీటకి ఇష్టం.
వైల్డ్ డాగ్స్, సింహాలు, చిరుతపులులు వీటికి ప్రధాన శతృవులు. దూరంగా ఉన్నప్పుడే ఇవి వాసనతో పసిగట్టి బొరియల్లో దాక్కుంటాయి. అవి వీటి ఇంట్లోకి చొచ్చుకుని వస్తే వాటి పంజాలతో ఎదురు దాడి చేస్తాయి. వీలైతే వాటి అవి తవ్విన గుంతలను లోపలనుంచి కప్పిపెట్టగలవు.
100 సెం.మీ పొడవు ఉంటాయి. బరువు మాత్రం అరవై నుంచి 80 కేజీల వరకూ ఉంటాయి.
ఆహారం కోసం ప్రతి రోజూ రాత్రి పూట వెళ్తాయి. కనీసం పదిహేను కిలోమీటర్లకు పైగా అలా ఆహారం కోసం ప్రయాణిస్తాయి.
వీటి జీవితంకాలం 23 ఏళ్లు.
Updated Date - 2023-03-27T23:48:27+05:30 IST