ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arhaan Sai Gaurishetty: 18 నెలల ఆర్టిస్ట్‌

ABN, First Publish Date - 2023-04-23T02:32:03+05:30

సాధారణంగా ఏడాదిన్నర వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. హైదరాబాద్‌కు చెందిన అర్హాన్‌ సాయి గౌరిశెట్టి, బొమ్మలు గీస్తూ ఇప్పటికే రెండు అంతర్జాతీయ అవార్డులు, రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా ఏడాదిన్నర వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. హైదరాబాద్‌కు చెందిన అర్హాన్‌ సాయి గౌరిశెట్టి, బొమ్మలు గీస్తూ ఇప్పటికే రెండు అంతర్జాతీయ అవార్డులు, రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్నాడు. 43 రకాల ఆర్ట్‌ టెక్నిక్స్‌తో 50 సమకాలీన ఫ్లూయిడ్‌ ఆర్ట్‌ పెయింటింగ్స్‌ను సృష్టించిన ఆ బాల కళాకారుడి గురించిన ఆసక్తికరమైన కథనం ఇది.

సెన్సరీ యాక్టివిటీలో భాగంగా అర్హాన్‌ తల్లి అర్హాన్‌కు ఎంతో చిన్న వయసులోనే పెయింటింగ్‌ పరిచయం చేసింది. ఇంట్లో అర్హాన్‌తో పాటు ఇంకో ముగ్గురు పిల్లలు కూడా వారాంతాల్లో ఆర్ట్‌ సెషన్‌లో పాల్గొంటూ ఉంటారు. ‘‘బాబుది చిన్న వయసు కాబట్టి మేం వేర్వేరు యాక్టివిటీ్‌సను పరిచయం చేశాం. అయితే అర్హాన్‌ ఆసక్తి పజిల్స్‌ మీద కాకుండా ఆర్ట్‌ మీదకు మళ్లడాన్ని మేం గమనించాం. వయసు చిన్నది కాబట్టి బ్రష్‌ పట్టుకోవడం కష్టం కావడంతో మేం బాబుకు ఫ్లూయిడ్‌ ఆర్ట్‌ను నేర్పించాం. అలా అర్హాన్‌ 45 పెయింటింగ్‌ టెక్నిక్స్‌ను సృష్టించుకుని ఇప్పటివరకూ 50 పెయింటింగ్‌లను రూపొందించాడు. మేం బాబుకు రంగులను అందించి, వదిలేస్తాం. వాడికి ఇష్టం వచ్చినట్టు బొమ్మలను గీయనిస్తాం. కానీ బాబు తయారుచేసినవన్నీ అద్భుతమైన పెయింటింగ్‌లుగా రూపం పోసుకున్నాయి. దాంతో బాబు పెయింటింగ్స్‌ను వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సుకు సబ్మిట్‌ చేశాం. వెంటనే వాళ్ల దగ్గరి నుంచి అనుమతి వచ్చింది. కొన్ని పెయింటింగ్స్‌ను ఆర్ట్‌ గ్యాలరీల్లో ప్రదర్శించాం. అదే సమయంలో బాబు పెయింటింగ్స్‌కు 4 అంతర్జాతీయ, రెండు జాతీయ అవార్డులు సాధించాయి. బాబుకి ఇంకా 18 నెలలే. మున్ముందు తాను ఆర్టిస్టుగా స్థిరపడాలనుకున్నా అందుకు మా పూర్తి మద్దతు ఉంటుంది’’ అంటూ చెప్పుకాచ్చారు అర్హాన్‌ తల్లి స్నేహిత.

పుట్టుకతో అబ్బిన విద్య

‘‘ కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఇతరత్రా సాంస్కృతిక సంస్థలూ మా అబ్బాయి కళను గుర్తించాయి. బాల్యంలో బాబుకు పెయింటింగ్‌, టెక్స్‌చర్‌ మొదలైన చిత్రకళా సామాగ్రిని అందించాం. 14 నెలల వయసులో బాబు పూర్తిగా పెయింటింగ్‌ మీదే ఆసక్తి కనబరిచి, ఫ్లూయిడ్‌ ఆర్టును సాధన చేయడం మొదలుపెట్టాడు. బాబు ఎప్పుడూ రంగులను ఒలకపోయలేదు. కాన్వాస్‌ మీదే తప్ప, నేల మీద రంగులను కుమ్మరించడు. బాబుకు మేమెక్కడా పెయింట్‌ పాఠాలు నేర్పించలేదు. చిత్ర కళ బాబుకు పుట్టుకతోనే అబ్బింది. మున్ముందు గొప్ప ఆర్టిస్టుగా ఎదుగుతాడని ఆశిస్తున్నా’’ అంటున్నారు అర్హాన్‌ తండ్రి, గౌరిశెట్టి అరుణ్‌.

Updated Date - 2023-04-23T02:32:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising