Bahamas : దేశం- బహమాస్
ABN, First Publish Date - 2023-03-04T23:30:34+05:30
బహమాస్ అంటే 700 దీవుల సముదాయం. ఈ చిన్ని దేశం క్యూబా, హయాతి, అమెరికా, యూకే బార్డర్లను కలిగి ఉంది.
బహమాస్ అంటే 700 దీవుల సముదాయం. ఈ చిన్ని దేశం క్యూబా, హయాతి, అమెరికా, యూకే బార్డర్లను కలిగి ఉంది.
కొలంబస్ శాన్ సాల్వడార్ అనే ప్రాంతానికి 1492లో వెళ్లాడు. అంటే అమెరికా కంటే ముందే కొలంబస్ ఇక్కడికి వెళ్లాడు. అక్కడ ఉండే ట్రైబల్స్ గొడవలు, వ్యాధుల వల్ల ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లారు. 1642లో బ్రిటీష్ వాళ్లు వచ్చారిక్కడికి. 1717 సమయంలో అయితే వీటిని బ్రిటీష్ కాలనీలు అని పిలిచేవాళ్లు. 17,18 శతాబ్దాల్లో సముద్రపు దొంగలు షిప్‌యార్డ్స్‌పై దాడి చేసేవాళ్లు. అక్కడ ఫ్రెంచ్, స్పానిష్ వ్యాపార ఓడలను కొల్లగొట్టేవాళ్లు సముద్రపు దొంగలు. దాదాపు 325 ఏళ్ల తర్వాత అంటే 1973 ప్రాంతంలో అక్కడ బ్రిటీష్ వారి చొరవతో ప్రశాంతత నెలకొంది. అప్పుడే ‘కామన్ వెల్త్ ఆఫ్ బహమాస్’ ఏర్పడింది.
ప్రతి ఏడాది దాదాపు ఇక్కడ హరికేన్స్ వస్తుంటాయి. ఎక్కడ చూసినా సరే నీలంరంగే కనపడుతుంది. ఈ దేశంలో కొన్ని పింక్ బీచ్‌లు ఉండటం విశేషం.
ఈ దేశం యాత్రికుల స్వర్గధామం. ఫ్లోరిడాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజధాని పేరు నాసు. ఈ దేశంలోని జనాభా మొత్తం నాలుగు లక్షలకు మించి లేదు.
ప్రపంచంలోనే పేరుగాంచిన ‘ది గ్రేట్ బ్లూ హోల్’ ఈ దేశంలోని సముద్రతీరంలో ఉంది. ఇది 202 మీటర్ల లోతు ఉంటుంది. క్రిస్టల్ క్లియర్‌లో లోపలి ప్రాంతం కనపడతాయిక్కడ. ఇక్కడే సాహసవిన్యాసం చేసే వారు రికార్డ్సు క్రియేట్ చేస్తుంటారు.
బహమాస్ టెక్నికల్‌గా మాప్‌లో చూస్తే ఇది కరీబియన్ దీవులకు చెందినది కాదని అర్థమవుతుంది.
ఈ దేశంలో ఇన్‌కమ్ టాక్స్ లేదు. దిగుమతిల మీద, టూరిస్టులు రావటం వల్ల డబ్బులు వస్తాయంతే.
ఈ దేశంలో పందులతో కలసి ఈత కొడతారు యాత్రికులు. ఇదో సరదా. ఇక్కడి విశేషమేంటంటే.. అండర్ వాటర్ నేషనల్ పార్క్ ఉంది.
ఈ దేశాన్ని హాలీవుడ్ స్పేస్ అని కూడా అంటారు. ఇక్కడ 30 హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించారు.
స్కైడైవింగ్‌కు ఫేమస్. ఈ దేశాన్ని ఐలాండ్ వండర్ అని పిల్చుకుంటారు. ఇక్కడ రెడ్ ఇండియన్ల ఉత్పత్తులు దొరుకుతాయి. సముద్రపు దొంగల ఆనవాళ్లతో పోస్టర్లు, స్టాంపులు, నాణేలు, వస్తువులు కనిపిస్తాయి.
Updated Date - 2023-03-04T23:30:34+05:30 IST