ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bear pride : ఎలుగు గర్వం

ABN, First Publish Date - 2023-08-02T04:54:18+05:30

ఒక అడవిలో ఎలుగు బంటి ఉండేది. దానికి రెండు పిల్లలు ఉండేవి. వాటిని బాగా చూసుకునేది. చెట్లనెక్కడం నేర్పించేది.. దగ్గరుండి మరీ వంకల్లో పిల్లలతో పాటు ఈదేది. అయితే ఆ ఎలుగుకు ఓ మానసిక

ఒక అడవిలో ఎలుగు బంటి ఉండేది. దానికి రెండు పిల్లలు ఉండేవి. వాటిని బాగా చూసుకునేది. చెట్లనెక్కడం నేర్పించేది.. దగ్గరుండి మరీ వంకల్లో పిల్లలతో పాటు ఈదేది. అయితే ఆ ఎలుగుకు ఓ మానసిక సమస్య ఉంది. అదేంటంటే.. ఇతరుల బాధను చూసి నవ్వటం, సంతోషంగా ఉండటం చేసేది. ఎందుకో ఇతరులు బాధగా ఉంటే అందులో ఆనందాన్ని పొందేది తెలీకుండా. దీంతో ఎలుగుకు పిచ్చిపట్టిందనేవి మిగతా జంతువులు.

తేనెటీగలు ఉన్న పుల్లను విరిచి జింకల దగ్గర వదిలేది. జింకలను తేనెటీగలు కుడుతుంటే సంతోషడేది. ఎగిరెగిరి నవ్వేది. ఒక గంపలాంటి ఆకు తీసుకొచ్చి అందులో కొన్ని కప్పలు వేసి పెద్ద పాము దగ్గర వదిలేసేది. ఆ పాము కప్పలను తింటుంటే.. ఆ కప్పలు పరిగెత్తుతుంటే ఎంతో సంతోషపడేది. ఆ పాముల దగ్గరకు ముంగిసలను పంపించి.. అవి కొట్లాడుతుంటే లోలోపల ఆనందపడేది. కోతుల దగ్గరకు చింపాజీలను పంపి భయపెట్టించేది. చెల్లా చెదురైన కోతులను చేరదీసి బాధలు వినేది. ఇలాంటి సమయంలోనే లోలోపల ఎంతో తెలీని సంతోషాన్ని ఆస్వాదించేది. ఈ చేష్టలు చూసిన ఓ చిలుక ఒక రోజు ఇలా అంది.. ‘అయ్యా.. ఎలుగుబంటి గారు. మీకు మీ జాతిలో ఉండే లక్షణాలే లేవు. కోతుల లక్షణాలివి. ఇంత అల్లరి చేస్తుంటే చూస్తున్నా. మీరు ఎలుగుబంటి.. హుందాగా ఉండండి’ అనడిగింది. ప్రతి వొక్కరూ నాకు సలహాలు ఇచ్చేవారే అంటూ కోప్పడింది ఎలుగు. ఒక రోజు వేటకు వెళ్లి ఇంటికి వెళ్తూనే.. ఎప్పుడూ ఎదురొచ్చే పిల్లలు రాలేదు. అవి ఎక్కడికి వెళ్లాయోనని బాధపడింది. అడవంతా తిరిగింది. పిల్లలు కనిపించక.. మూర్ఛపోయి పడిపోయింది. ఇంతలో రెండు ఎలుగు పిల్లలు వచ్చి దగ్గరగా కూర్చున్నాయి. కన్నబిడ్డల్ని చూస్తుంటే ఏడుపొచ్చింది ఎలుగుకు. ‘ఆపమ్మా..’ అంటూ ఎలుగుపిల్లలు గట్టిగా అన్నాయి. ‘ఇతరులు బాధపడుతుంటే ఆనందపడ్డావు. మేం చూశాం. మేము కనపడకపోయేసరికి బాధపడుతున్నాం. మేం కావాలనే మన ఇంటి వెనకాల రాతికింద దాక్కున్నాం. నీలా మిగతా జంతువులు బాధపడతాయి కదా!’ అన్నవి పిల్లలు. దీంతో ఎలుగుకు గర్వం అణగిపోయింది. తప్పు తెలుసుకుంది.

Updated Date - 2023-08-02T04:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising