Binturong : మీకు తెలుసా
ABN, First Publish Date - 2023-08-29T23:18:38+05:30
చెట్లమీద హుషారుగా తిరుగుతుండే ఈ జంతువు చూడటానికి పిల్లి, ఎలుగు పిల్లలా కనిపిస్తుంది. అయితే దీని పేరు ‘బింతురాంగ్’ అని పిలుస్తారు.
చెట్లమీద హుషారుగా తిరుగుతుండే ఈ జంతువు చూడటానికి పిల్లి, ఎలుగు పిల్లలా కనిపిస్తుంది. అయితే దీని పేరు ‘బింతురాంగ్’ అని పిలుస్తారు.
2.8 ఫీట్ల పొడవు ఉంటుంది. దీని దగ్గరకు వెళ్తూనే వెన్నపూసిన పాప్‌కార్న్ స్మెల్ వస్తుంది.
దక్షిణ ఆసియాలోని రెయిన్ ఫారెస్టుల్లో జీవిస్తుంటాయివి. మనదేశంలోని నార్త్ ఈస్ట్ దేశాలతో పాటు బంగ్లాదేశ్, మలేషియా, ఇండియా, దక్షిణ చైనా, వియత్నాం లాంటి దేశాల్లో నివసిస్తాయి.
ఎప్పుడు చూసినా కొమ్మల మీద ఆడుకుంటున్నట్లే ఉంటాయి. చిటారు కొమ్మలమీదనే నడుస్తుంటాయి. ఊగుతుంటాయి. అయితే కొమ్మల మీద లేకుంటే.. పురుగులు, చిన్న పక్షులు, పళ్లు లాంటి స్నాక్స్‌ను ఎక్కడో చోట కూర్చుని తింటుంటుంది.
ఈ జంతువును బేర్‌క్యాట్ అని కూడా పిలుస్తారు. చిన్న పక్షులు గుడ్లు, ఆకులు, చేపలను తింటాయి.
వీటి అరుపు గట్టిగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు చెట్ల కిందికి దిగవు.
ఈ జంతువుకంటే పొడవుగా తోక ఉంటుంది. దీని వల్ల కొమ్మల మీద నుంచి దూకేప్పుడు స్ర్పింగ్‌లా ఉపయోగపడుతుంది.
ఇవి పది కేజీల నుంచి పధ్నాలుగు కేజీల బరువు ఉంటాయి.
మగ జంతువుల కంటే ఆడ బేర్‌క్యాట్స్ ఇరవైశాతం పెద్దవిగా ఉంటాయి.
ఇవి సులువుగా ఈదగలవు. డైవ్ కొట్టగలవు. ఇక వీటి దంతాలు పొడవుగా ఉంటాయి.
పులులు, పాములతోనే వీటికి ఇబ్బంది.
వీటి జీవనకాలం 18 ఏళ్లు. 30 ఏళ్ల కిందతో పోలిస్తే ఇపుడు ఇవి 30 శాతం తగ్గిపోయాయి.
Updated Date - 2023-08-29T23:18:52+05:30 IST