బీర్బల్ తెలివికి దొంగ చిత్తు!
ABN, First Publish Date - 2023-08-23T03:08:24+05:30
ఒక రోజు బీర్బల్ ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్లాలనుకున్నాడు. ఆ సమయంలో ఆగ్రా-ఢిల్లీ రహదారి దొంగలతో నిండి ఉండేది. ఆగ్రా నుంచి కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత- బీర్బల్‌కు ఒక వ్యక్తి తోడయ్యాడు.
ఒక రోజు బీర్బల్ ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్లాలనుకున్నాడు. ఆ సమయంలో ఆగ్రా-ఢిల్లీ రహదారి దొంగలతో నిండి ఉండేది. ఆగ్రా నుంచి కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత- బీర్బల్‌కు ఒక వ్యక్తి తోడయ్యాడు. ఆ వ్యక్తి ఒక దొంగ. ప్రయాణికులను నమ్మించి వారి వద్ద ఉన్న విలువలైన వస్తువులు దొంగిలించటం అతని వృత్తి. ఆ దొంగ బీర్బల్‌తో ‘‘ఈ రహదారి అంతా దొంగలతో నిండి ఉంటుంది. అందువల్ల మనిద్దరం కలిసి ప్రయాణిద్దాం. దొంగలు వస్తే ఒకరికి మరొకరు తోడుగా ఉంటాం’’ అన్నాడు. బీర్బల్ వెంటనే అంగీకరించాడు. వారు అలా ఒక రోజు ప్రయాణించి- రాత్రికి ఒక సత్రానికి చేరారు. అక్కడ బీర్బల్ భోజనం చేసి సుఖంగా నిద్రపోయాడు. బీర్బల్ వద్ద ఉన్న విలువైన వస్తువుల కోసం దొంగ చాలా వెతికాడు. ఏమి కనిపించలేదు. ఆ మర్నాడు మళ్లీ ప్రయాణం చేసి రాత్రికి వేరే సత్రానికి చేరారు. ఆ రోజు కూడా దొంగకు ఏమి దొరకలేదు. ఆ మర్నాడు వారు ఢిల్లీకి చేరుకున్న తర్వాత- బీర్బల్‌తో ఆ దొంగ- ‘‘నేను ఒక దొంగను. ఇప్పటి దాకా నేను ఎప్పుడూ మోసపోలేదు. మీరు బాగా విలువైన వస్తువులు తీసుకువస్తున్నారనుకున్నా. నాకు ఏమి దొరకలేదు.. వాటిని ఎక్కడ దాచారో చెప్పండి’’ అన్నాడు. అప్పుడు బీర్బల్ - ‘‘వెర్రివాడా! నువ్వు దొంగవన్న విషయం నాకు ముందే తెలుసు. అందుకే నా వద్ద ఉన్న విలువైన సామగ్రిని నీ దిండు కింద దాచా. నువ్వు నా వస్తువులు వెతికావు కానీ నీ దిండు కింద వెతకలేదు..’’ అని సమాధామిచ్చాడు. ఆ దొంగ బీర్బల్ తెలివికి మెచ్చుకొని జారుకున్నాడు.
Updated Date - 2023-08-23T03:08:24+05:30 IST