Shag: మీకు తెలుసా?
ABN, First Publish Date - 2023-07-14T22:39:09+05:30
ఈ పక్షిని ‘బ్లూ ఐడ్ కార్మొరాంట్’ లేదా షాగ్ అని పిలుస్తారు. ఈ పక్షి కిందిభాగంలో తెలుపు, పైభాగంలో నలుపు ఉంటుంది. ముక్కు దగ్గర పసుపు పచ్చగా ఉంటుంది.
ఈ పక్షిని ‘బ్లూ ఐడ్ కార్మొరాంట్’ లేదా షాగ్ అని పిలుస్తారు. ఈ పక్షి కిందిభాగంలో తెలుపు, పైభాగంలో నలుపు ఉంటుంది. ముక్కు దగ్గర పసుపు పచ్చగా ఉంటుంది. కళ్లు నీలం రంగులో ఉంటాయి. అందుకే అదే పేరుతో పిలుస్తారు. ఇవి కేవలం అంటార్కిటికా పెనిన్సులా, స్కాటియా ఆర్క్ ఐలాండ్స్‌లో మాత్రమే ఉంటాయి.
69 సెం.మీ నుంచి 79 సెం.మీ వరకూ పొడవు ఉంటుంది. వింగ్ స్పాన్ 1.1 మీటరు
ఇవి 25 మీటర్ల లోతు ఉండే చేపలను పట్టి బయటకు వచ్చి తింటాయి. కొన్ని 100 మీటర్ల వరకూ సముద్రంలోపలికి డైవ్ కొట్టి వేటాడతాయి. అలా వెళ్లినపుడు సీల్స్‌కు దొరికి ఆహారం అవుతుంటాయి.
ఇవి ఒకటిన్నర కేజీ నుంచి దాదాపు నాలుగు కేజీల వరకూ బరువు ఉంటాయి.
రెండు లేదా మూడు గుడ్లు పెడతాయి. ఇరవై ఎనిమిది రోజులు పొదుగుతాయి. పిల్లలను బాగా చూసుకుంటాయి.
ఇవి కొన్ని కిలోమీటర్ల వరకూ రాళ్లమీద గూళ్లను ఏర్పరచుకుంటాయి. వీటి కాలనీలు షాగ్ కాలనీలంటారు.
ఇవి ఎక్కడకు వెళ్లినా గుంపులుగా వెళ్తాయి.
వీటి జాతి దాదాపు 14 రకాలు ఉన్నాయి.
ఇవి గాల్లో వేగంగా దూసుకుపోతాయి. గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి.
అంటార్కిటికా ప్రాంతంలో మాత్రమే ఉంటాయి. ఇవి ఎక్కడికి వలసపోవు.
ఈ పక్షులు 15 నుంచి 20 ఏళ్లు జీవిస్తాయి.
Updated Date - 2023-07-14T22:39:09+05:30 IST