Blue fox: నీలరంగు నక్క
ABN, First Publish Date - 2023-07-13T23:30:53+05:30
ఒక అడవిలో నక్క ఉండేది. దానికి వయసు మీద పడింది. తిండిని కూడా సంపాదించుకోవటానికి ఇబ్బంది పడేది. సింహాలో, పులులో తిని మిగిలిన ఆహారానికి ఆశపడేది.
ఒక అడవిలో నక్క ఉండేది. దానికి వయసు మీద పడింది. తిండిని కూడా సంపాదించుకోవటానికి ఇబ్బంది పడేది. సింహాలో, పులులో తిని మిగిలిన ఆహారానికి ఆశపడేది. ఒక రోజు సింహం తినగా మిగిలిన ఆహారం తినడానికి వెళ్తూంటే దారిలో అడవి కుక్కలు వెంటపడ్డాయు. అసలే ముసలి నక్క ఆపై పరిగెత్తాలంటే కష్టం. అడ్డదారిలో కుక్కలకు కనపడకుండా పరిగెత్తి ఒక గ్రామంలోకి వెళ్లిపోయింది. కుక్కలు వెంటాడుతున్నాయనే భ్రమలో నక్క ఓ పెద్ద బానలో దాక్కుంది. లేచేసరికి అందులోని నీలం రంగు వల్ల నక్క నీలంరంగులోకి మారిపోయింది.
బయటికొచ్చాక తనకు తానే కొత్తగా మారిపోయింది. దర్జాగా అడవిలోకి వెళ్లింది. ఇలాంటి రంగు ఉండే జంతువును మిగతా జంతువులు ఎన్నడూ చూడలేదు. పైగా సింహం, పులి లాంటి క్రూరమృగాలు ఉన్నప్పటికీ.. నేను ప్రత్యేకం. ఈ అడవికి రాజును అంటూ చెప్పింది. కోపంతో సింహం ఊగిపోయినా.. ఈ కొత్త జంతువుతో ఎందుకు తలనొప్పి అనుకుంటూ భయపడింది. అలా కొన్ని రోజులు నక్క ఆడిందే ఆట.. పాడిందే పాట. ఈ వింత జంతువు భలే ఉందే అని కోతులు, ఎలుగుబంట్లు.. దూరం నుంచి వచ్చి చూసేవి. నక్క కదలకుండా ఆహారం పొందేది.
తినుకుంటూ ఎంచక్కా ఉండేది. ఇట్లానే శేషజీవితం గడపాలనుకుంది నక్క. తినటం, హాయిగా గుహలో నిద్రపోవటం దీని దినచర్యలు. ఒక రోజు గుహలో నిద్రపోతుండగా నక్కల అరుపు వినపడింది. బయటకి వచ్చింది సరాసరి ఈ నీలం రంగు నక్క. వెంటనే గట్టిగా అరిచింది. అంతే అక్కడ ఎదురుగా ఉండే సింహం, పులి.. వెంటనే నీలంరంగు నక్కను చంపేశాయి. ఇన్నాళ్లూ నక్క చేసిన మోసమా ఇది అనుకున్నాయి అడవిలోని జంతువులన్నీ.
Updated Date - 2023-07-13T23:30:53+05:30 IST