Camel way: ఒంటె దారి!
ABN, First Publish Date - 2023-07-10T23:45:45+05:30
తెనాలి రామకృష్ణుడు దారింటా వెళ్తున్నాడు. అడవిలోకి వెళ్లగానే ఓ వ్యాపారి ఎదురయ్యాడు. ఆందోళనగా ఉన్నాడు ఆ వ్యాపారి. అయ్యా.. ‘ఈ దారిలో ఒంటెను చూశారా?’ అని అడిగాడు వ్యాపారి. ‘మీ ఒంటె కాలికి గాయం అయ్యిందా?’ అని అడిగారు రామకృష్ణుడు.
తెనాలి రామకృష్ణుడు దారింటా వెళ్తున్నాడు. అడవిలోకి వెళ్లగానే ఓ వ్యాపారి ఎదురయ్యాడు. ఆందోళనగా ఉన్నాడు ఆ వ్యాపారి. అయ్యా.. ‘ఈ దారిలో ఒంటెను చూశారా?’ అని అడిగాడు వ్యాపారి. ‘మీ ఒంటె కాలికి గాయం అయ్యిందా?’ అని అడిగారు రామకృష్ణుడు. ‘అవును.. అవును.. నా ఒంటె కాలికి గాయమైంది’ అన్నాడు వ్యాపారి. ‘ఏమీ లేదు.. దారిలో ఒంటె మూడు కాళ్ల ముద్రలే ఉన్నాయి. చూశావా?’ అన్నాడు రామకృష్ణుడు. ‘అవునవును గాయమైంది కదా.. అందుకే’ అన్నాడు ఆ వ్యాపారి. అంతలోనే ‘మీ ఒంటెకు ఒకే కన్ను ఉందా?’ అనడిగాడు రామకృష్ణుడు. ‘అవును.. అయ్యా’ అన్నాడు మరింత గట్టిగా.
‘వ్యాపారి గారూ.. మీ ఒంటెమీద సంచుల్లో ఒక వైపు గోధుమలు.. మరో వైపు చక్కెర వేశారు కదా’ అనడిగాడు రామకృష్ణుడు. సంతోషంతో ‘అవును.. అయ్యగారూ. ఆ విషయం మీకు ఎలా తెలుసు’ అన్నాడు గట్టిగా. ‘ఏమీ లేదు.. కింద చూడు చక్కెర పడింది. చీమలున్నాయి. అంటే ఎడమవైపున సంచికి రంధ్రాలున్నాయి అనుకుంటా’ అన్నాడు రామకృష్ణుడు. ‘అయ్యా.. మీరు నా ఒంటెను ఎక్కడ చూశారో’ చెప్పండి అన్నాడు మరింత సంతోషంగా. ‘నేను మీ ఒంటెను చూడలేదు. ఆనవాళ్లు బట్టి చెబుతున్నా’ అన్నాడు రామకృష్ణుడు. ‘మరి.. ఒంటి కన్ను’ అన్నారు కదా అన్నాడు వ్యాపారి. ‘అవును.. గడ్డి వరుసల్లో ఒక వైపు మాత్రమే తిన్నది కాబట్టి.. అది గుడ్డిదేమో’ అన్నారు రామకృష్ణుడు. దీంతో వ్యాపారి నీరసించిపోయాడు.
‘అయ్యా.. దయచేసి నా ఒంటెను ఆచూకి చెప్పండి’ అన్నారు వ్యాపారి. ‘నీ ఒంటెను చూడలేదు. అయితే దాని పాదముద్రలు.. ఆనవాళ్లు బట్టి ఈ దారిలో వెళ్లు’ అంటూ చెప్పారు రామకృష్ణుడు. అదే దారింట వ్యాపారి వెళ్లాడు. ఒంటె దొరికింది. రామకృష్ణుడు తెలివితేటలను మనసులోనే మెచ్చుకున్నాడు వ్యాపారి. ఆనందంతో గట్టిగా కేకలు వేశాడు.
Updated Date - 2023-07-10T23:45:45+05:30 IST