Clever fox : తెలివి నక్క
ABN, First Publish Date - 2023-09-03T00:00:13+05:30
అడవిలో ఓ నక్క ఉండేది. తెలివిలో ఘనం. అయితే సోమరిలో తనకు తానే సాటిగా ఉండేది. అదే అడవిలో ఓ చిరుత పులి ఉండేది. దానికి గర్వం ఎక్కువ. పైగా తను చెప్పిందే అందరూ నమ్మాలి. తనకే వత్తాసు పలకాలి అనే ధోరణి చిరుతది. పైగా తన చర్మం అందంగా ఉంటుందని రోజూ తనకు
అడవిలో ఓ నక్క ఉండేది. తెలివిలో ఘనం. అయితే సోమరిలో తనకు తానే సాటిగా ఉండేది. అదే అడవిలో ఓ చిరుత పులి ఉండేది. దానికి గర్వం ఎక్కువ. పైగా తను చెప్పిందే అందరూ నమ్మాలి. తనకే వత్తాసు పలకాలి అనే ధోరణి చిరుతది. పైగా తన చర్మం అందంగా ఉంటుందని రోజూ తనకు తానే మెచ్చుకునేది. పెద్ద పులి చర్మం హీనంగా ఉంటుంది అని మిగతా జంతువులకు చెప్పేది. అవి సచ్చినట్లు చిరుత మాటనే నిజం అని చెప్పేవి.
ఒక రోజు చిరుతపులి దారింటా వెళ్తోంది. ఓ చెట్టు కింద తెలివైన నక్క పడుకుంది. నక్కను నిద్రలేపింది చిరుత. ఈ చర్మం అందంగా ఉంది కదా? అని అడిగింది. అవునన్నట్లు తల ఊపింది. ఇక చిరుత తన ప్రగల్భాలు మాత్రం ఆపడం లేదు. తన చర్మ సౌందర్యం, చర్మం మీద ఉండే చుక్కలు గురించి చెబుతూనే ఉంది. చివరికి నక్క విసిగిపోయింది. ‘మానవుడు మనకన్నా బలహీనుడు. అయితే అంత ఉన్నతంగా ఎందుకు జీవిస్తున్నాడు?’ అనడిగింది నక్క. చిరుతపులి అయోమయంలో పడింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. చివరికి ఎందుకు? అనడిగింది చిరుత. ‘ఎందుకంటే అందమైన చర్మం ఉండి కాదు. చురుకైన బుర్ర ఉండటం వల్ల’ అన్నది నక్క.
చిరుతపులికి కోపం వచ్చింది. క్షణాల్లో నక్కను చంపేయాలన్నంత కోపం. నక్క కూడా కోపంతో రగిలిపోతోంది. దీన్ని సంహరించేవాడు లేడా? అనుకున్నది. అంతలోనే దానికి ఓ ఆలోచన వచ్చింది. ‘చిరుతా.. మీ చర్మం అద్భుతంగా ఉంది. నేను కాదనలేదు. అయితే ఇంతటి అందమైన చర్మం ఉంటే మానవుడు మిమ్మల్ని చంపక విడిచిపెట్టడు. తెలుసా?’ అన్నది నక్క. చిరుత ఆలోచనలో పడింది. అంతలోనే ‘అదిగో మానవుడు.. నిన్ను విడిచిపెట్టడు’ అంటూనే నక్కను విడిచిపెట్టి చిరుత కారడవిలోకి పరుగులు పెట్టింది. అలా నక్క తనకు తాను కాపాడుకుంది.
Updated Date - 2023-09-03T00:00:13+05:30 IST