ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Malaysia : దేశం- మలేషియా

ABN, First Publish Date - 2023-12-09T23:40:51+05:30

మలేషియా జనాభా దాదాపు మూడు కోట్ల ఇరవై లక్షలు. ఈ దేశ రాజధాని కౌలలంపూర్‌. మలే అనే పదం నుంచి మలేషియా పేరు వచ్చింది. మలే అంటే..

  • మలేషియా జనాభా దాదాపు మూడు కోట్ల ఇరవై లక్షలు. ఈ దేశ రాజధాని కౌలలంపూర్‌. మలే అనే పదం నుంచి మలేషియా పేరు వచ్చింది. మలే అంటే గ్రీకు భాషలో ‘ప్రజల సమూహం’ అని అర్థం.

  • కౌలలంపూర్‌లో పెట్రోనాస్‌ టవర్స్‌ ప్రపంచంలోనే ట్విన్‌ టవర్స్‌లో ఎత్తయినవి. 1,483 ఫీట్లు ఉంది. 88 అంతస్తులు. 41,42 మధ్య ఓ బ్రిడ్జి ఉంది. ఈ టవర్సే మలేషియాకు సింబల్‌.

  • మలేషియా పాత పేరు ‘ఆరియో కెర్సోనిసస్‌’. దీని అర్థం ‘పెన్సిలా ఆఫ్‌ గోల్డ్‌’. గ్రీకు వ్యక్తి ఆ పేరు పెట్టాడు.

  • మలేషియాలో 65,887 కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి. ఈ దేశంలో 60 శాతం మలేషియా వాసులైతే, ఇరవై ఐదు శాతం చైనీయులు, పది శాతం భారతీయులు ఉన్నారు.

  • 1957 వ సంవత్సరంలో ఈ దేశం స్వతంత్రం పొందింది. 1965లో హద్దులు ఏర్పడ్డాయి.

  • షూ కనిపెట్టిన వ్యక్తి మలేషియాకు చెందినవాడు. అతని పేరు జిమ్మీ చూ.

  • మలేషియా దేశం రెండు భాగాలుగా ఉంటుంది. పెన్సులర్‌ మలేషియా, మలేషియా బోర్నియో. వీటి మధ్యలో దక్షిణ చైనా సముద్రం ఉంటుంది.

  • ఇక్కడ 16,17 శతాబ్దం వరకూ వెండి స్పానిష్‌ నాణేలను వాడేవారు. ప్రస్తుతం వీరి కరెన్సీ పేరు రింగెట్స్‌.

  • ఈ దేశం తొలి రాజు సుల్తాన్‌ మొజఫర్‌ షా(1136). 1816 సంవత్సరంలో నెలక్పొల్పి ఓల్డెస్ట్‌ ఇంగ్లీషు పాఠశాల ఉందిక్కడ.

  • ఇక్కడి గునుంగ్‌ ములు నేషనల్‌ పార్క్‌ యునేస్కో గుర్తింపు పొందింది.

  • పామాయిల్‌ను ఎగుమతిలో ప్రపంచంలోనే రెండో స్థానం, రబ్బర్‌ ఎగుమతిలో ప్రపంచంలో మూడోస్థానం.

  • ప్రపంచంలోనే అతి పెద్ద ఆకు పేరు ‘గియాంట్‌ టారో’ ఈ దేశంలో ఉంది. ఈ దేశంలోనే రఫ్లేసియా అనే పువ్వు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు. మూడు అడుగులు వెడల్పు. 11 కేజీల బరువుంటుంది.

  • 878 చిన్న ద్వీపాలు ఈ దేశంలో ఉన్నాయి.

Updated Date - 2023-12-09T23:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising