ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-06-23T23:39:32+05:30

గుబురు జుట్టు, కోతిలా చెట్ల కొమ్మలకు వేటాడే ఈ జంతువును బ్రౌన్‌ థ్రోటెడ్‌ త్రీ టాయ్డ్‌ స్లాత అని పిలుస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుబురు జుట్టు, కోతిలా చెట్ల కొమ్మలకు వేటాడే ఈ జంతువును బ్రౌన్‌ థ్రోటెడ్‌ త్రీ టాయ్డ్‌ స్లాత అని పిలుస్తారు. ఇది కోతి జాతికి చెందినదే.

మధ్య, దక్షిణ అమెరికాలోని చిత్తడి అడవుల్లో ఈ జాతి నివసిస్తుంది. ముఖ్యంగా కోస్టారికా, పనామా, వెనిజుల, బొలీవియా, ఈక్విడార్‌, బ్రెజిల్‌, పెరు దేశాల్లో ఇవి కనిపిస్తాయి.

ఇది చెట్ల ఆకులను తిని బతుకుతుంది. వాస్తవానికి ఈ ఆకులు జీర్ణం కానివి. అయితే ఆవు పొట్టలో మాదిరి దీని పొట్లలో కూడా విభిన్నమైన గదులుంటాయి. బ్యాక్టీరియా వల్ల ఆకులు జీర్ణం అవుతాయి. అలా మెల్లగా జీర్ణం చేసుకుంటుంది. ప్రపంచంలోనే అతి నిదానంగా తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునే జంతువు ఇదే. పూలు, పండ్లు కూడా తింటుంది.

వీటి కాళ్లకు మూడు పొడవైన గోర్లు ఉంటాయి. అందుకే దీనికి అలా పేరు వచ్చింది. ఇవి పొడవుగా, పదునుగా ఉంటాయి. వీటి సాయం వల్లనే ఆహారాన్ని సులువుగా తుంచుకోగలదు. చెట్లమీద ఎగరగలవు. కిందపడకుండా నిద్రపోగలవు.

మగ స్లాత మీద చారల్లాంటివి ఉంటాయి. వీటి వల్ల ఆడస్లాతలు ఆకర్షించబడతాయి.

ఏ జంతువైనా పొడవు మాత్రం 42 సెం.మీ. నుంచి 80 సెం.మీ మధ్యనే ఉంటుంది.

మూడు నుంచి ఆరు కేజీల మధ్య బరువు ఉంటాయి.

నేల మీద నడవగలవు. అయితే మరీ అంత దూరంగా నడవలేవు. ఇరవై మీటర్లు నుంచి 20 ఎకరాలలోపే తిరుగుతుంటాయి. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లటానికి ఇష్టపడవు. ఇవి నీటిలో అద్భుతంగా ఈ దగలవు.

ఇవి 15 గంటలకు పైగా నిద్రపోతాయి. అలా ఇవి సోమరిగా ఉంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత సంవత్సరం పాటు వాటి ఆలనాపాలనా చూసుకుంటాయి. దీని ముఖం చూసినపుడు నవ్వుతున్నట్లు కనపడుతుంది.

వీటి చుట్టూ 25 శాతం జుట్టు ఉంటుంది కాబట్టి చలికాలంలో కూడా వణకవు. వీటి శరీరం వెచ్చగా ఉంటుంది.

ఇవి ముప్ఫయి ఏళ్ల పాటు బతుకుతాయి.

Updated Date - 2023-06-23T23:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising