Macaws ; మీకు తెలుసా?
ABN, First Publish Date - 2023-03-10T23:50:49+05:30
చిలుకల్లో 376 రకాలున్నాయి. వాటిలో పెద్దచిలుకలే ‘మకావ్స్’. అతి పెద్ద మకావ్స్ బ్రెజిల్ ఉన్నవి.
చిలుకల్లో 376 రకాలున్నాయి. వాటిలో పెద్దచిలుకలే ‘మకావ్స్’. అతి పెద్ద మకావ్స్ బ్రెజిల్ ఉన్నవి.
మధ్య, దక్షిణ అమెరికాల్లో.., మెక్సికో, ఉత్తర అర్జెంటీనా రెయిన్ ఫారెస్టుల్లో ఇవి జీవిస్తాయి. అమెజాన్ అడవుల్లో కూడా ఎరుపు, నీలం, ఆకుపచ్చ మకావ్‌లు ఉంటాయి.
మకావ్‌లు అంటే ప్రత్యేకం.. తెలివైనవి. ముఖ్యంగా ఇవి మిమిక్రీ చేస్తాయి. మనం చెప్పిన మాటల్ని కాపీ పేస్ట్‌లా మళ్లీ మనకే వినిపిస్తాయి. పక్కన వినిపించే శబ్దాలను కూడా మిమిక్రీ చేయగలవు. వీటి బ్రెయిన్‌లో వోకల్ లెర్నింగ్ సెంటర్ అభివృద్ధి చెంది ఉంటుంది. అందుకే ఇవి మిమిక్రీ చేయగలవు. వైల్డ్ మకావ్స్ అడవుల్లోని శబ్దాలను మిమిక్రీ చేస్తాయి. వాటి పిల్లలు కూడా మిమిక్రీ చేస్తాయి.
కొన్ని వైల్డ్ మకావ్స్ అగ్రెసివ్‌గా ఉంటాయి. ఎంత అంటే వాటిముక్కుతో టెంకాయను పగలగొడతాయి.
ఇవి ఎమోషనల్‌గా ఉంటాయి. చిన్న కిడ్స్‌లా మనుషులతో మెలుగుతాయి. శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిందేంటంటే.. కొన్ని మకావ్స్ వాటి ఆహారాన్ని దాచి పెట్టుకుంటాయి. అయితే వాటి పార్ట్‌నర్‌కు మాత్రం షేర్ చేస్తుంది మకావ్.
ఆహారం కోసం ఇవి అడవిలో రోజూ 15 మైళ్లు వెళ్తాయి. ఎంత లావుగా ఉన్నా వీటి ఎముకలు తేలికగా ఉండటం వల్ల ఇవి గాలిలో ఎగురుతాయి.
విత్తనాలు, పండ్లు, గుడ్లు తింటాయి. ఇవి రెండు నుంచి నాలుగు గుడ్లు పెడతాయి. పెంచుకునే మకావ్స్‌కు అవకాడో, చాక్లెట్లు, మాంసం పెట్టకూడదు. వీటికి అనారోగ్యసమస్యలు వస్తాయి.
ఇవి అద్భుతమైన పెట్ బర్డ్స్. వీటి జీవనకాలం అరవై ఏళ్లు. ఎనభై ఏళ్లదాకా జీవించిన మకావ్స్ కూడా ఉన్నాయి.
Updated Date - 2023-03-10T23:50:49+05:30 IST