ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tapir : మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-03-14T23:40:21+05:30

ఇది హిప్పో లేదా వరాహం అనుకోకండి. ఈ జంతువు పేరు తాపిర్‌. నలుపు, తెలుపు రంగులతో పాటు నోటి ముందుభాగం తొండంలా కనిపిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇది హిప్పో లేదా వరాహం అనుకోకండి. ఈ జంతువు పేరు తాపిర్‌. నలుపు, తెలుపు రంగులతో పాటు నోటి ముందుభాగం తొండంలా కనిపిస్తుంది.

తాపిర్‌లను ‘లివింగ్‌ బ్రీతింగ్‌ ఫాజిల్స్‌’ అంటారు. సుమారు 55 మిలియన్ల సంవత్సరాల కిందట వీటి ఆనవాళ్లుంది.

ఇవి ప్రపంచమంతటా ఉన్నాయి. దక్షిణ అమెరికాలో అధికంగా ఉంటాయి. చిన్న తాపిర్స్‌ చిరుతపులిలా ఉంటాయి. వాటి రంగు, టెక్చర్‌ వల్ల చిరుత అని భ్రమపడతారు. పరిగెత్తుతుంటే చిరుతే తరుముకొస్తుందేమో అనుకుంటాం.

వీటి తొండంలాంటి నిర్మాణం ఉండటం వల్ల ఆహారాన్ని తీసుకుని తినగలవు. దీంతో పాటు దీని సాయంతో నీటిలో వేగంగా ఈదుతాయి.

ఇవి జన సంచారం ఉందని తెలిస్తే దాక్కుంటాయి.

వీటిని ‘గార్డెనర్‌ ఫారెస్ట్‌’ అంటారు. ఇవి పండ్లను తింటాయి. ఆ పండ్లను తిని విసర్జించటం వల్ల ఆ చెట్టు మరోచోట పెరుగుతుంది. అందుకే వీటిని అలా పిలుస్తారు.

ఇవి గుంపులు గుంపులుగా ఉంటాయి. వీటికి చూపు తక్కువ. భూమి మీద కానీ లేదా నీళ్లలో ఉండే జంతువులను కాని దగ్గరకు వస్తే కానీ వీటికి కనపడవు. అయితే వీటి నాసికారంధ్రాలు మాత్రం అద్భుతం. దూరంగా ఏదైనా జంతువు లేదా మనిషి వచ్చాడంటే వాటికి ఇట్టే అర్థమైపోతుంది.

వీటి జీవనకాలం ముప్ఫయి ఏళ్లు.

Updated Date - 2023-03-14T23:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising