ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాడిద నీడ!

ABN, First Publish Date - 2023-03-15T23:21:47+05:30

ఒక ఊరిలో ఓ సంత ఉండేది. ఆ సంతలో ఒక గాడిదను పట్టుకుని ఒక వ్యక్తి ఉన్నాడు. ఓ వర్తకుడు అక్కడకు వచ్చాడు. ‘గాడిద మీద ఫలానా గ్రామానికి వెళ్లాల’ని అడిగారు. రేటును..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఒక ఊరిలో ఓ సంత ఉండేది. ఆ సంతలో ఒక గాడిదను పట్టుకుని ఒక వ్యక్తి ఉన్నాడు. ఓ వర్తకుడు అక్కడకు వచ్చాడు. ‘గాడిద మీద ఫలానా గ్రామానికి వెళ్లాల’ని అడిగారు. రేటును మాట్లాడాడు. ఆ గ్రామం చాలా దూరం ఉండటం వల్ల అధిక డబ్బులు అడిగాడు. చివరకి బేరం కుదిరింది. వెంటనే గాడిదను ఎక్కాడు ఆ వర్తకుడు. గాడిద యజమానితో మాట్లాడుతూ.. వర్తకుడు వెళ్తున్నాడు. అసలే అది ఎండాకాలం. రెండు గంటల తర్వాత వేడి తీవ్రత అధికమైంది. ఎండను తట్టుకోలేక.. ‘పెద్ద చెట్టుకింద ఆపు’ అన్నాడు వర్తకుడు. అయితే దారింటా ఎక్కడా చెట్లు లేవు. దీంతో ఒక చోట ఆగారు.

గాడిద నీడలో విశ్రాంతి తీసుకుందామని వర్తకుడు అనుకున్నాడు. గాడిద నుంచుంది. ఆ నీడలో వర్తకుడు కూర్చున్నాడు. యజమాని కూడా అక్కడకు వచ్చాడు. ‘నువ్వు పక్కకు వెళ్లు’ అన్నాడు వర్తకుడు. దీంతో యజమానికి కోపం వచ్చింది. ‘ఎందుకు వెళ్లాలి?’ అని గట్టిగా అన్నాడు. ‘నేను డబ్బులు చెల్లిస్తున్నా. అందుకే ఆ నీడ నాకే చెందుతుంది’ అన్నాడు వర్తకుడు. దీంతో యజమాని మరింత కోపోద్రిక్తుడయ్యాడు. ‘నువ్వు గాడిద మీద ఎక్కి ప్రయాణం చేయటానికి మాత్రమే డబ్బులు చెల్లించావు. నీడకు కాదు’ అన్నాడు. దీంతో ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు. తిట్టుకున్నారు. చివరికి కొట్టుకునేదాకా వచ్చారు. ఆ గాడిద మాత్రం కాస్త తెలివైనది. దీంతో ఈ మనుషులకు బుద్ధి ఉందా? లేదా? చిన్న చిన్న విషయాలకు కొట్లాడుకుంటున్నారు అనుకున్నది. వారిద్దరికీ గుణపాఠం చెప్పాలనుకుంది. వర్తకుడు, యజమాని కొట్లాడుకునే సమయంలో గాడిద దూరంగా పరిగెత్తింది. కొద్దిసేపటి తర్వాత చూసుకున్నారు. యజమాని మాత్రం ‘అయ్యో నా గాడిద వెళ్లిపోయింది. ఈ మూర్ఖుడితో గొడవ పడి’ అనుకున్నాడు. వర్తకుడు మాత్రం ‘అయ్యో.. సమయానికి హాజరవ్వాలి. నా ప్రయాణం మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయిందే’ అని బాధపడ్డారు వర్తకుడు.

నీతి- అనవసరమైన వాటికి కొట్లాడితే.. అవసరమైనవి కోల్పోతాం.

Updated Date - 2023-03-15T23:21:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising