ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Flying Elephants: ఎగిరే ఏనుగులు

ABN, First Publish Date - 2023-03-20T22:23:40+05:30

లక్షల ఏళ్ల కితం గాల్లో ఎగిరే ఏనుగులు ఉండేవి. వాటిని చూసి జనాలు ఆశ్చర్యపోయేవారు. ఇంత పెద్ద జంతువులు ఎలా ఎగురుతున్నాయనే ఆలోచన కూడా జనాలకు రాలేదు. అంతలా గాల్లో ఎగిరేవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లక్షల ఏళ్ల కితం గాల్లో ఎగిరే ఏనుగులు ఉండేవి. వాటిని చూసి జనాలు ఆశ్చర్యపోయేవారు. ఇంత పెద్ద జంతువులు ఎలా ఎగురుతున్నాయనే ఆలోచన కూడా జనాలకు రాలేదు. అంతలా గాల్లో ఎగిరేవి. ఒక్కో ఏనుగుకు నాలుగు రెక్కలుండేవి. ఈ ఎగిరే ఏనుగులన్నీ అందరినీ ఇబ్బంది పెట్టేవి. రకరకాల సమస్యలు సృష్టించేవి. పేదల ఇళ్లమీద వాలేవి. అక్కడ ఎగిరేవి. ఆ ఇళ్లు కూలిపోయేవి. ఇలా కూడా ధ్వంసం చేస్తారా? అంటూ బాధపడ్డారు.

రోజురోజుకూ ఏనుగులు గర్వంగా మారిపోయాయి. తమకి ఎదురేలేదని భావించారు. నానాటికీ వాటి ఆగడాలు ఎక్కువయయ్యాయి. ఎవరినీ లెక్క చేయలేదు. ఒక రోజు దేవుడు తన వద్దకు ఏనుగులన్నింటినీ ఆహ్వానించారు. వాటికి అద్భుతమైన ఆహారం పెట్టారు. తిన్న తర్వాత అన్నీ నేలమీద పడుకుండిపోయాయి. నిద్రపోయాయి. రెండు రెక్కలను కట్‌ చేసి నెమళ్లకు అతికించాడు దేవుడు. అలా నెమళ్లు అందంగా కనిపించాయి. ఆ అందం అద్భుతమే అన్నట్లు అందరూ చూశారు.

కొద్ది సేపటిలో ఏనుగులు నిద్ర లేస్తాయి అనుకునే సమయంలో మిగతా రెండు రెక్కలను అరటిచెట్టుకు అంటించాడు. వాటి ఆకులు పెద్దగా అయ్యాయి. ఏనుగులు నిద్రలేచాయి. హాయిగా నిద్రపోయామే అనుకున్నాయి. అన్ని ఏనుగులూ ఒకరివైపు ఒకరు చూసుకున్నాయి. వాటికి రెక్కలు లేవు. కనీసం రెండు రెక్కలు కూడా దేవుడు ఉంచలేదు అని కోప్పడ్డాయి. ఆరోగ్యంగా ఉన్నాం. అదే పదివేలనుకున్నాయి. కోపంతో దేవుడిని ఏమీ చేయలేక.. అడవిలోకి పరిగెత్తిపోయాయు. అప్పటి నుంచి ఏనుగులు అడవికే పరిమితమయ్యాయి. ఆ ఎగిరే ఏనుగుల కథ అంతమయింది.

Updated Date - 2023-03-20T22:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising