ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మేక తెలివి

ABN, First Publish Date - 2023-07-21T23:15:37+05:30

అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఓ మేకల మంద. మేకల మందలో ఓ తెలివైన కొమ్ముల మేక ఉండేది. అదే మందను నడిపించేది. ఆ మంద ముందు ఓ వేటకుక్క, వెనకాల రెండు వేటకుక్కలు నడిచేవి. మేకలు కాసే వ్యక్తి లేకున్నా సరే.. ఆ మందను కాపలా కాసేవి ఆ కుక్కలు. ఆ మేక నడిపించేది.

అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఓ మేకల మంద. మేకల మందలో ఓ తెలివైన కొమ్ముల మేక ఉండేది. అదే మందను నడిపించేది.

ఆ మంద ముందు ఓ వేటకుక్క, వెనకాల రెండు వేటకుక్కలు నడిచేవి. మేకలు కాసే వ్యక్తి లేకున్నా సరే.. ఆ మందను కాపలా కాసేవి ఆ కుక్కలు. ఆ మేక నడిపించేది.

ఆ తెలివైన మేకకు తియ్యటి రేగుపళ్లంటే ఇష్టం. వాటికోసం అది ఎక్కడికైనా పోతుంది. దాని బలహీనత అది. ఒక రోజు అడవిలోని ఓ గుట్టమీద మేకలన్నీ మేస్తున్నాయి. ఆ పచ్చని గడ్డిని తింటూ తెలివైన మేక నీళ్ల దగ్గరకు వచ్చింది. కొన్ని నీళ్లు తాగింది. ఇక ఆ ప్రవాహం ఓ పిల్లకాలువది. దానిమీద సన్నటి వంతెన ఉంది. ఆ వంతెన దాటుకుని తెలివైన మేక వెళ్లింది. అక్కడ పండిన రేగుపళ్ల వాసన వచ్చింది. దీంతో మరింత దూరం ఆశతో వెళ్లింది. ఆ మేకను చూసి ఓ నక్క క్షణాల్లో దగ్గరకు వచ్చింది. ఇక మేకను పట్టుకోవటానికి పొద చాటున వస్తోంది. మేక ఈ విషయం గ్రహించింది. నక్కబావా బయటకు రా అన్నది. నక్క వచ్చింది. ‘నువ్వు నన్ను ఎలాగూ తింటావు. నాకు తెలుసు. మందలో నాకంటే బలిష్టమైన మేకపోతు ఉంది. దాన్ని తిను. తోలుకొస్తా’ అన్నది మేక. ‘నిజమేనా’ అన్నది నక్క. ‘నీ మీద ఒట్టు. మేకలకు నీ అంత తెలివి ఉంటుందా?’ అంటూ ముందుకు వెళ్లింది. ‘మే.. ’ అంటూ అర్చింది. ఓ బలిష్టమైన మేకపోతు వచ్చినట్లు నక్కకు కనపడింది. పంట పండింది.. ఈ రోజు రెండు మేకలు నాకు దొరుకుతాయి అని మనసులో అనుకుంది. ఇంతలోనే మూడు వేటకుక్కలు క్షణాల్లో నక్క మీదకు దూకాయి. వాటిని చూస్తూనే నక్క ప్రాణాలు గాల్లోనే పోయినట్లు అనిపించింది. ఎలాగూ తనకు అడవిలో తెలిసిన తోవ కాబట్టి ప్రాణభయంతో అతి వేగంగా పరిగెత్తింది. కుక్కలకు దొరకలేదు. మొత్తానికి ‘మే..’ అంటూ ఆ వేటకుక్కలను మేక పిలిచింది.. అనుకుంటూ నక్క ‘హమ్మయ్య.. బతికిపోయా’ అనుకుంది.

Updated Date - 2023-07-21T23:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising