ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Story : తెలివి వచ్చిందోచ్‌!

ABN, First Publish Date - 2023-12-09T03:44:31+05:30

ఒక ఊరిలో కొండయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను తెలివైన వాడే కానీ అతని చేష్టలు చూస్తే మాత్రం వెర్రి వాడు అనుకునేవారు. అలా వెర్రి కొండయ్యగా పిలిచేవారంతా.

ఒక ఊరిలో కొండయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను తెలివైన వాడే కానీ అతని చేష్టలు చూస్తే మాత్రం వెర్రి వాడు అనుకునేవారు. అలా వెర్రి కొండయ్యగా పిలిచేవారంతా. అయితే వెర్రి కొండయ్య అని పిలిస్తే మాత్రం ఎంతో కోపం వచ్చేది కొండయ్యకు. తన వెర్రి పోవటానికి ఆకు పసర్లు తాగాడు. ఎంతో మంది బాబాలను మొక్కున్నాడు. అయినా ఎవరితో ఏమీ కాలేదు. దీంతో వెర్రి ఇక పోదేమోనని బాధపడ్డాడు. ఈ బాధలోనే కొన్నాళ్లు ఉన్నాడు.

ఒక రోజు చేను దగ్గరకు పోతూ ఓ కుంట దగ్గర ఆగాడు. అక్కడ చేపలు పట్టేవారున్నారు. అక్కడే నిల్చుని చూస్తున్నాడు. చేపలు పట్టేవాడు కొండయ్యను చూసి ‘అరె.. వెర్రి కొండయ్య’ ఉన్నాడు అనుకున్నాడు మనసులో. ‘ఇటొచ్చావేమీ?’ అనడిగాడు చేపలు పట్టేవాడు. ‘ఏమీ లేదు.. నాకు వెర్రి ఉంది కదా. ఎంత మంది దగ్గరకు తిరిగినా పోలేదు. ఏమైనా ఉపాయం చెప్పవా?’ అనడిగాడు. ‘ఏమీ లేదు.. వెర్రి పోవటం చాలా సులువు. తెలివి సులువుగా వస్తుంది’ అన్నాడంతే. వెర్రి కొండయ్యకు ఊపు వచ్చింది. ఉత్సాహం వచ్చింది. ఆనందం వేసింది. అయితే ఏమి చేయాలి? అనడిగాడు సూటిగా. ‘చేప మెదడు తింటే తెలివి పెరుగుతుంది. ఇది యుగాల నాటి మంచి మాట’ అన్నాడు ఆ బెస్త కుటుంబానికి చెందిన వ్యక్తి. ‘ఎంతా?’ అనడిగితే చేప తలను కేవలం రూపాయికి ఇచ్చాడు. వెళ్లిపోయి వెర్రి కొండయ్య చేపను వండి తలలోని మెదడు తిన్నాడు.

అలా చేప తలలు కొంటూనే ఉన్నాడు. రెండేసి నెలలు అయిపోయాయి. ఒక రోజు చేపలు పడుతుంటే ‘అంతా మోసం’ అంటూ వెర్రి కొండయ్య వచ్చాడు. ‘ఏమి మోసం?’ అనడిగాడు చేపలు పట్టేవాడు. ‘నువ్వు రూపాయికి తల అమ్ముతున్నావు. చేప రూపాయి కదా. ఇలా రెండేసి నెలలు పాటు అమ్మావు. ఇదేం బాలేదు. ఇది మోసం కదా?’ అన్నాడు. వెంటనే చేపలు పట్టేవాడు.. ‘అద్భుతం.. ఇంతగా ఆలోచించావంటే నీకు తెలివి ఉంది. తెలివొచ్చింది’ అన్నాడు. వెంటనే వెర్రి కొండయ్య ‘నాకు తెలివి వచ్చిందోచ్‌’ అంటూ ఊర్లోకి పరిగెత్తాడు. ఆ రోజు నుంచి తెలివిగా ఉండేవాడు కొండయ్య.

Updated Date - 2023-12-09T03:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising