ఒకరికొకరు సాయం
ABN, First Publish Date - 2023-04-10T23:45:24+05:30
ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. పొలంలో తన పని చేసుకుంటూ ఉండేవాడు. జంతువులు, పక్షులంటే అతనికి ప్రేమ. వేటినీ హింసించేవాడు కాదు.
ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. పొలంలో తన పని చేసుకుంటూ ఉండేవాడు. జంతువులు, పక్షులంటే అతనికి ప్రేమ. వేటినీ హింసించేవాడు కాదు. ఆ పొలానికి దగ్గరలో ఒక రాబందు ఉండేది. ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవి. నాకంటే గొప్పవారు లేరని అది విర్రవీగేది. వేటలో తనకు మించిన వాళ్లు లేరని భ్రమపడేది. అయితే తనతో గొడవ పెట్టుకోవటానికి అడవిలో ఏ పక్షులూ సాహసించేవి కావు.
ఒక రోజు ఎప్పటిలానే ఆ రాబందు అడవిలోకి వేటకు బయలుదేరింది. ఒక చిన్న కప్పను చూసి కిందకు వేగంగా వచ్చింది. అక్కడే వేటగాడు పన్నిన ఉచ్చులో చిక్కుకుంది. ఆ వలలో గింజుకుంటోంది. ఆ సమయంలో అక్కడ వేటగాడు లేడు. దూరంగా ఉండే చెరువు దగ్గరకు నీళ్లు తాగడానికి వెళ్లాడ. అదే దారిలో రామయ్య కూడా నీళ్లు తాగడానికి వెళ్తున్నాడు. వలలో చిక్కుకున్న రాబందును చూసి అతని మనసు తరుక్కుపోయింది. వల దగ్గరకు వెళ్లి ఆ రాబందును బయటకు తీశాడు. ఆ రాబందు ఆ రైతును చూసి ఆశ్చర్యపోయింది. మనుషుల్లో కూడా మంచి వాళ్లు ఉంటారనుకుంది. అంత వరకూ తనకున్న ఆలోచనలను కొట్టిపడేసింది. బతుకుజీవుడా అనుకుని అక్కడినుంచి గాల్లోకి ఎగిరింది. రామయ్య కూడా ఏమీ తెలీనట్లు నీళ్లు తాగటానికి చెరువు పక్కకు వెళ్లిపోయాడు.
ఒక రోజు సేద్యం చేశాక రామయ్య బాగా అలసిపోయాడు. నిద్రపోదామని చెట్టుకింద కూర్చుకున్నాడు. అలసిపోవటంతో వెంటనే కునుకు వచ్చింది. నిద్రపోయాడు. రామయ్యను కాటేయడానికి ఓ పాము వచ్చింది. రామయ్యను కాటేస్తున్న క్షణంలో రాబందు వచ్చి ఆ పామును కాళ్ల మధ్య తీసుకుని పొలంకి దూరంగా వెళ్లింది. ఆ పామును చంపేసి తన భక్తిని చాటుకుంది. ఈ పరిస్థితిని కళ్లారా చూసిన మరో రైతు రామయ్య దగ్గరకు పోయి విషయం చెప్పాడు. రాబందు చేసిన సాయాన్ని రామయ్య తలచుకుని సంతోషపడ్డాడు.
Updated Date - 2023-04-10T23:45:24+05:30 IST