ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Himalayan Monal : మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-11-09T04:34:48+05:30

తలమీద కిరీటంలా ఈకలు.. చూడటానికి అచ్చు నెమలిలా అందంగా ఉండే ఈ పక్షిని ‘హిమాలయన్‌ మోనల్‌’ అని పిలుస్తారు. 2500 మీటర్లు నుంచి 4500 మీటర్లు ఎత్తులో

  • తలమీద కిరీటంలా ఈకలు.. చూడటానికి అచ్చు నెమలిలా అందంగా ఉండే ఈ పక్షిని ‘హిమాలయన్‌ మోనల్‌’ అని పిలుస్తారు. 2500 మీటర్లు నుంచి 4500 మీటర్లు ఎత్తులో నివసిస్తాయి. మగపక్షులు అందంగా ఉంటాయి. అయితే ఆడపక్షులు మాత్రం గోధుమరంగులో ఉంటాయి.

  • బరువు కేజీన్నర నుంచి రెండు కేజీల మఽధ్యలో ఉంటాయి. 70 సెం.మీ పొడవు ఉంటాయి.

  • ఆసియా ఖండంలో మనదేశం(ఉత్తరాఖండ్‌, కశ్మీర్‌, హిమాలయ ప్రాంతాల్లో)తో పాటు పాకిస్తాన్‌, భూటాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, చైనా, నేపాల్‌, మయన్మార్‌ దేశాల్లో ఈ పక్షులు కనిపిస్తాయి.

  • వీటి గుంపులో తక్కువ పక్షులుంటాయి. ఇదో సోషల్‌ బర్డ్‌. చిన్న మొక్కల మొదళ్ల దగ్గర గుంతలు తవ్వుతాయి. 25 సెం.మీ వరకూ తవ్వి అక్కడ నిద్రపోతాయి.

  • పురుగులు, విత్తనాలు, పండ్లు లాంటివి తిని బతుకుతాయి.

  • ప్రతి ఆడపక్షి మూడు నుంచి ఐదు గుడ్లు మాత్రమే పెడుతుంది. ఇరవై ఏడు రోజులు పొదుగుతాయి. పిల్లలు పట్టిన తర్వాత ఆర్నెళ్ల తర్వాత అవి స్వతంత్రంగా బతుక్కోగలవు.

  • గాలిలో దూసుకుపోయేటప్పుడు, మంచులో పరిగెత్తేప్పుడు చాలా అందంగా కనపడతాయివి.

  • 1970ల్లో హిమాలయన్‌ ప్రాంతాల్లో ఈ పక్షులను వేటాడటం ఓ ఆటగా భావించేవారు. ముఖ్యంగా మాంసం కోసం వేటాడేవాళ్లు. ఇప్పుడు వీటి వేటను నిషేధించారు. మనదేశంలోని స్టాంప్స్‌మీదనే కాకుండా నేపాల్‌ దేశంలోని నోట్ల కాగితాల మీద వీటి ఫొటోలు ఉంటాయి.

Updated Date - 2023-11-09T04:40:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising