Hyena : మీకు తెలుసా?
ABN, First Publish Date - 2023-06-04T00:29:21+05:30
అడవిలోని జంతువులను వేటాడటంలో హైనాలది అందె వేసిన చేయి. ఇవి ఉత్తర ఆఫ్రికాలోని ఎడారుల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
అడవిలోని జంతువులను వేటాడటంలో హైనాలది అందె వేసిన చేయి. ఇవి ఉత్తర ఆఫ్రికాలోని ఎడారుల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
హైనాలు మూడు రకాలు. చుక్కల హైనా, గోధుమ రంగు హైనా, చారల హైనా. ఈ చారల హైనాలు మిగతా వాటికంటే బలమైనవి. బరువైనవి. డామినేటింగ్‌గా ఉంటాయి. చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి.
అడవిలోని గడ్డిభూముల్లో దాక్కుని ఉండి కంటికి కనపడవు. ఇవన్నీ గుంపులుగా ఉంటాయి. గేదెలు, కంచరగాడిదలు, జింకలు, గుర్రాలు.. ఇలా వేటినైనా తెలివిగా వేటాడతాయి. సింహాలనూ భయపెట్టగలవు. అయితే ఎక్కువగా సింహాలు వేటాడిన ఆహారం మీద ఇవి ఆధారపడతాయి. సింహాలు తింటుంటే మధ్యలో వచ్చి ఆహారాన్ని గుంజుకుని పోతాయి. వీటితో సింహాలు కూడా గొడవపడలేవు. అందుకే ఆహారాన్ని వదిలేస్తాయి.
వీటికి సోషల్ ఇంటిలిజెన్స్ ఎక్కువ. ఎంతా అంటే.. కొంతమంది పరిశోధకులు పజిల్స్‌లా చేసి మధ్యలో ఆహారాన్ని పెడితే.. అవి చాలా సులువుగా అధికమించాయట. కోతులకంటే స్మార్ట్. లంచ్‌బాక్స్‌లను కూడా ఓపెన్ చేయగలవు.
ఒక పెద్ద శునకం బరువంత ఇవి ఉంటాయి. వీటి వేగం గంటకు 60 కి.మీ.
హైనాలు ఒకటి నుంచి మూడు పిల్లలను కంటాయి. ఇవి పుడుతూనే కళ్లు తెరచి, గట్టి కండరాలు కలిగి ఉంటాయి. అలా ఉన్నా కూడా తల్లి హైనా ఆర్నెళ్లు పాలిస్తుంది. ఆ తర్వాత కూడా తన కూనకు పాలు ఇచ్చి పెంచుతుంది. అందుకే హైనాలను గ్రేట్ మదర్స్ అంటారు.
వీటి పంజాలు బలమైనవి. దొరికిన జంతువు మాంసాన్నే కాదు ఎముకలను విరగ్గొడతాయి. ఇక పళ్లు విషయం చెప్పనక్కర్లేదు. అది నోరు తెరుస్తూనే భయపడతాయి జంతువులు.
హైనా గొంతు విచిత్రంగా ఉంటుంది. నవ్వినట్లుంటుంది గొంతు.
చల్లగా ఉండటానికి నీటిలో పడుకుంటాయి. రెండు, మూడు హైనాలు గుంపుగా ఉంటే వీటిని సింహాలూ ఏమీ చేయలేక వెనక్కి తిరిగి వెళ్లిపోతాయి.
కప్పలు, చేపలు, పండ్లు, జంతువులు, పురుగులు.. ఇలా వేటినైనా తింటాయివి.
Updated Date - 2023-06-04T00:29:36+05:30 IST