ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

indri: మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-01-13T02:44:21+05:30

నలుపు, తెలుపు ఉండే ఈ జంతువులను ‘ఇండ్రి’ అంటారు. కోతుల్లా చెట్లమీద ఎగురుతాయి. కొమ్మలను వెనక కాళ్లతో పట్టుకుని కిందికి వేలాడుతూ రకరకాల విన్యాసాలు చేస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నలుపు, తెలుపు ఉండే ఈ జంతువులను ‘ఇండ్రి’ అంటారు. కోతుల్లా చెట్లమీద ఎగురుతాయి. కొమ్మలను వెనక కాళ్లతో పట్టుకుని కిందికి వేలాడుతూ రకరకాల విన్యాసాలు చేస్తాయి. వీటి జంపింగ్‌ స్కిల్స్‌ అద్భుతంగా ఉంటాయి. వీటి గొంతు చిన్న పిల్లల అరుపులా ఉంటుంది. గట్టిగా అరిస్తే ఏడిచే పిల్లల గొంతులా అనిపిస్తాయి. ఆ గొంతును ఇంటే మనుషులతో పాటు ఇతర జంతువులూ భయపడతాయి.

తల దగ్గరనుంచి తోక దగ్గర వరకూ 72 సెం.మీ ఉండే ఈ జంతువుల బరువు 9 కేజీల వరకూ ఉంటుంది. తోక ఐదు సెంటీమీటర్లు ఉంటుంది. వీటి కళ్లు పసుపు రంగులో ఉంటాయి. చెట్లమీదకు పది మీటర్ల దూరం కూడా సులువుగా ఎగరటానికి అంచనా వేసే సత్తా వాటి కళ్లకు ఉంది.

కోతుల్లానే చెట్లమీద నివసిస్తాయి. దూరం నుంచి చూస్తే ఎలుగులా కనిపిస్తుంది. ఎందుకంటే వీటికి జుట్టు ఎక్కువ. రెయిన్‌ ఫారెస్ట్‌లో ఉండటం ఇష్టం. చిత్తడి అడవుల్లోనే కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఉండేది మడగాస్కర్‌లో!

వీటిని బబకోటో అని కూడా పిలుస్తారు. ఇవి శాకాహారులు. ఆకులు, విత్తనాలు, పండ్లు తిని బతుకుతాయి.

50 వేల సంవత్సరాల కిందటే వీటి ఆనవాళ్లు ఆఫ్రికాలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రతి గుంపులో ఐదు లేదా ఆరు మాత్రమే ఉంటాయివి. ఇండ్రిలు సోమరులు. దాదాపు ఉదయం పూట పడుకుంటే పదహారు గంటలు కూడా నిద్రపోతాయి. ముఖ్యంగా పరిగెత్తటంలో కూడా ఇవి సోమరులు.

వీటి జీవితకాలం పదిహేనేళ్లు.

Updated Date - 2023-01-13T02:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising