Story : నమ్మకం గొప్పదా? భక్తి గొప్పదా?
ABN, First Publish Date - 2023-10-13T23:35:01+05:30
అక్బర్ రాజ్యంలో ఉదయం పూట సభ ప్రారంభమైంది. నమ్మకం, భక్తి గురించి చర్చ వచ్చింది. నమ్మకం కంటే భక్తి గొప్పదని భావించాడు అక్బర్ బాద్‌షా. ఎదురుగా ఉండే బీర్బల్‌ను
అక్బర్ రాజ్యంలో ఉదయం పూట సభ ప్రారంభమైంది. నమ్మకం, భక్తి గురించి చర్చ వచ్చింది. నమ్మకం కంటే భక్తి గొప్పదని భావించాడు అక్బర్ బాద్‌షా. ఎదురుగా ఉండే బీర్బల్‌ను కూడా అభిప్రాయం అడిగారు రాజుగారు. వెంటనే బీర్బల్ ఇలా అన్నారు. నమ్మకమే గొప్పది. నమ్మకం వల్లనే భక్తి కుదురుతుందని చెప్పారు. అయినా రాజుగారికి ఏమాత్రం రుచించలేదు. ఇలా మాటలతో కాకుండా ఏదైనా ప్రత్యక్షంగా నిరూపించగలవా? బీర్బల్ అని అడిగాడు. వెంటనే అదేముంది మహారాజా.. నాకు ముప్ఫయి రోజులు మాత్రమే గడువు ఇప్పించండి చాలు అన్నాడు.
మరుసటి రోజు బీర్బల్ ఒక చెప్పుల జతను జరీ శాలువాలో కట్టి ఎవరికీ చెప్పలేదు. ఊరు బయట ఒక చోట గుంత తవ్వించి పూడ్పించాడు. దాని మీద సమాధి కట్టించాడు. ఆ ఘోరీ పవిత్రమైనది చెప్పాడు. పైగా ఓ మౌలీదని చెప్పాడు. దీంతో కొందరు మెల్లగా ఆ ఘోరీ దగ్గరకు వచ్చారు. మొక్కుకున్నారు. ప్రశాంతంగా ఉంటుంది.. కోరిన కోరికలు నెరవేరుతాయని పేరు వచ్చింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడకు వస్తున్నారు. అదో ప్రముఖ ఫుణ్య స్థలంగా మారింది. ఆ నోటా ఈ నోటా పడి చివరకు రాజుగారికి ఆ విషయం తెలిసింది. అంత మహత్తు ఉందా అని మనసులో అనుకున్నాడు.
ఒక రోజు అక్బర్ గుర్రం మీద స్వారీకి వెళ్తున్నాడు. ఉన్నట్లుండి పవిత్ర ఘోరీని చూడానుకున్నాడు. తన మందీ మార్బలంతో వెళ్లాడు. అక్కడ జనాల గుంపు. అక్బర్‌కు ఆశ్చర్యమేసింది. నాకు తెలీకుండా ఇంతటి ప్రముఖ స్థలం ఉందా? అనుకున్నాడు. ఘోరీ దగ్గరకు వెళ్తోంటే.. బీర్బల్ మాత్రం రాలేదు. రమ్మని సైగ చేసినా బీర్బల్ వెళ్లలేదు. దీంతో రాజుగారు ఆ ఘోరీకి మొక్కి వెనక్కి వస్తూనే సైనికుల అధిపతి వచ్చి .. ‘రాజావారు.. శుభశూచకం. మనం పక్క రాజ్యాన్ని ఓడించాము’ అన్నారు. వెంటనే అక్బర్ ఇలా అన్నాడు. ‘చూడు బీర్బల్.. భక్తి ఎంత గొప్పదో! ఇలా బయటకు వస్తూనే అద్భుతమైన సమాచారం అందించారు సైనికాధిపతి’ అంటూ పొంగిపోయాడు అక్బర్. ‘ఎప్పుడో మనం గెలిచాం. విషయాన్ని ఆలస్యంగా అందుకున్నారు. ఇది మొక్కితేనే మనం గెలవలేదు’ అన్నారు. అసలు ఇది భక్తే కాదన్నారు బీర్బల్.
అక్బర్‌కు కోపం వచ్చింది. బీర్బల్ కూడా కొందరు కూలివాళ్లను పిలిచి ఆ ఘోరీని తవ్వమన్నాడు. రాజుగారు తవ్వద్దన్నారు. ఇందులో ఒకటి ఉంది చూపించాలి.. మీకు కోపం వస్తే తవ్విన తర్వాత శిక్షించండి’ అన్నాడు. వెంటనే తవ్వమన్నాడు అక్బర్. లోపల చూస్తే జరీ చీర కనపడింది. ఆ చీరలో చెప్పులున్నాయి. ఇది చూసి అక్బర్ ఆశ్చర్యపోయారు. ఇదెలా? అన్నారు. నెల కందట నేనే ఈ చెప్పులను పూడ్పించాను. ఇది ఇలా పేరు తెచ్చుకుంది అన్నాడు. ఇక్కడ భక్తి నమ్మకం వల్లనే వచ్చింది అన్నాడు బీర్బల్. వెంటనే.. బీర్బల్‌ను మెచ్చుకున్నారు. అతని మేధోతనానికి బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చారు అక్బర్.
Updated Date - 2023-10-13T23:35:01+05:30 IST