Lazy Donkey: సోమరి గాడిద!
ABN, First Publish Date - 2023-04-13T23:32:57+05:30
అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి ఓ గాడిద ఉండేది. దానికి మంచిగా గడ్డి పెట్టేవాడు. విశ్రాంతి కూడా ఇచ్చేవాడు.
అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి ఓ గాడిద ఉండేది. దానికి మంచిగా గడ్డి పెట్టేవాడు. విశ్రాంతి కూడా ఇచ్చేవాడు. రంగయ్య దూది అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఎవరో పట్టణంలో మంచి డబ్బులు వస్తాయంటే ఇక పట్టణానికి బయలుదేరాడు. గాడిద మీద పది దూది మూటలు వేశాడు. అవి తేలికగా ఉన్నా గాడిదకు నడవటానికి బద్ధకమైంది. పైగా పట్టణానికి వెళ్లాలంటే నదిని దాటి వెళ్లాలి. నదిని దాటి పట్టణానికి వెళ్లారు. అక్కడ దూది అమ్మి డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ప్రతి రోజు తన గాడిదమీద దూదిని రవాణా చేసి డబ్బులు సంపాదించి హాయిగా ఉండేవాడు.
ఒకరోజు దూది మూటలమ్మి పట్టణం నుంచి తిరిగి వస్తోంటే రంగయ్య మిత్రుడు ఎదురయ్యాడు. దూదిమూటలు అమ్మటం కంటే ఉప్పు మూటలు అమ్మమని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత రోజు గాడిదపై ఐదు ఉప్పు మూటలు వేశాడు. గాడిద కదల్లేదు. దీంతో కర్రతో బాది తీసుకెళ్లాడు. నది దాటేప్పుడు గాడిద కిందపడిపోయింది. దీంతో బయటకు వెళ్లేసరికి ఉప్పంతా కరిగిపోయింది. ఆ వ్యాపారి పట్టణానికి వెళ్లకుండా బాధతో తిరిగి వెళ్లాడు. ఇదేదో బావుందని.. పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేదని గాడిద అనుకుంది. మరుసటి రోజు కూడా ఉప్పు మూటలు వేసి గాడిదను నది దాటించపోయాడు. గాడిద కావాలనే కూర్చుంది. ఉప్పు కరిగిపోయింది.
ఇలా రెండోసారి కూడా చేసింది. దీంతో యజమానికి విషయం అర్థమైంది. మరుసటి రోజు ఎనిమిది దూది మూటలను వేశాడు గాడిదపై. యథావిధిగా నదిని దాటుతున్నారు. ప్రవాహం తక్కువగా ఉంది. అయినా సరే సోమరి గాడిద కావాలనే మధ్యలో కిందపడినట్లు ఎప్పటిలానే నటించింది. లేవగానే దూది మూటలు బరువయ్యాయి. అలానే పట్టణానికి తీసుకెళ్లాడు వ్యాపారి. ఇక సోమరితనంగా ఉంటే యజమాని కర్రతో బాదటం లేదా తిండి పెట్టడేమోనని మరుసటి రోజునుంచి గాడిద బాగా పని చేయాలనుకుంది. తన సోమరితనాన్ని తగ్గించుకుంది.
Updated Date - 2023-04-13T23:32:57+05:30 IST