ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమరి కుక్కపిల్ల

ABN, First Publish Date - 2023-04-02T00:27:57+05:30

ఒక ఇంటిలో కుక్కపిల్ల(పప్పీ), పిల్లికూన ఉండేది. ఇద్దరూ మిత్రులు. గొడవ పడేవాళ్లు కాదు. సంతోషంగా కాలం గడిపేవాళ్లు. ఆ ఇంటి యజమాని రెండు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఒక ఇంటిలో కుక్కపిల్ల(పప్పీ), పిల్లికూన ఉండేది. ఇద్దరూ మిత్రులు. గొడవ పడేవాళ్లు కాదు. సంతోషంగా కాలం గడిపేవాళ్లు. ఆ ఇంటి యజమాని రెండు జంతువులను సమంగా ప్రేమించేవాడు. అలా చూడటం వల్ల పప్పీ, పిల్లికూన తమకంటే అదృష్టవంతులు ఎవరూ లేరనుకునేవి. యజమాని దగ్గరలోని పట్టణానికో, బయటికో, చేనుకో వెళ్లినపుడు పప్పీ ఇంట్లో బాగా ఆడుకునేది. అలా రోజంతా ఇంట్లోని వస్తువులతో ఆడుకోవటం, నిద్రపోవడం, గేట్‌ దగ్గరకు వెళ్లి అరవటం.. లాంటివి చేసేది. దాని అల్లరి మామూలుగా ఉండేది కాదు. అయితే పిల్లికూన మాత్రం ఇళ్లంతా తిరిగేది. ఎక్కడ ఏ వస్తువు ఉంది? కిచెన్‌లో ఏ వస్తువులు ఉన్నాయి. ఇలా పరిసరాలన్నింటినీ గమనించేది. అయితే ఈ విషయం పప్పీకి తెలీదు. ఇది ఇంట్లో అంతా వెతకటం ఏంటో అంటూ పప్పీ నవ్వేది. అది చూసి పిల్లికూన బాధపడేది.

‘అయినా పిల్లికూన నువ్వు ఎంతో పిచ్చిదానివి. కామెడీ చేస్తావు. మనకు మన యజమాని మనల్ని బాగా చూసుకుంటున్నాడు. ఇక నీకేమి కావాలి?’ అంటూ వెటకారం చేసేది. ఆ తర్వాత కొన్నాళ్లకు కుక్క విశ్వాసంకల జంతువు అని ప్రతి ఒక్కరికీ యజమాని చెప్పాడు. చెప్పటంతో పాటు పప్పీని బాగా చూసుకోవటం ప్రారంభించాడు. నేనేమి తప్పు చేశానని పిల్లికూన బాధపడేది. దీంతో అనుకోకుండా పప్పీ మీద కోపం పెంచుకుంది పిల్లికూన.

ఒకరోజు తన యజమాని వేరే గ్రామానికి వెళ్లాడు. అతనికో ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి వెళ్లాడు. ఆ సాయంత్రానికి ఇంటికి రాలేకపోయాడు. అయితే తన పెంపుడు జంతువులు ఎలా ఉన్నాయో అని బాధపడేవాడు. కొన్నాళ్లకు యజమాని ఇంటికి వచ్చాడు. ఆ లోపు పప్పీ కష్టాల్లో పడింది. పైగా పిల్లికూనకు ఎక్కడ ఏ ఆహారం ఉందో తెలుసు కనుక మెల్లగా తినేది. పప్పీ అలా తినటానికి కుదరలేదు. తనకి ఎక్కడ ఏ పదార్థం ఉందో తెలీదు. యజమాని ఇంటికి వస్తూనే పిల్లికూన ఆరోగ్యంగా ఉంది. పప్పీ మాత్రం తిండిలేక బక్కచిక్కిపోయింది. ఎముకలు బయటపడినట్లుంది. అది చూసి ‘అయ్యో.. నీకు సోమరి ఎక్కువ. ఏదీ గమనించవు. తోక కూడా ఊపలేకున్నావు. ఇంత దారుణమైన స్థితికి నువ్వే వెళ్లావు’ అంటూ దానికి ఆహారం చేసి పెట్టాడు. ఆ రోజు నుంచి పిల్లికూనను పప్పీ వెటకారం చేయలేదు. ఆహారం ఎలాగైనా, ఏ వేళలో అయినా సంపాదించుకునే జ్ఞానం కావాలి దేవుడా అని మనసులో అనుకుంది.

Updated Date - 2023-04-02T00:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising