do you know : మీకు తెలుసా?
ABN, First Publish Date - 2023-11-29T23:42:18+05:30
1912 నుంచి 1948 వరకూ ఒలింపిక్స్‌లో సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళ, భవననిర్మాన కౌశల్యాలకు మెడల్స్‌ను బహుకరించేవారు.
1912 నుంచి 1948 వరకూ ఒలింపిక్స్‌లో సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళ, భవననిర్మాన కౌశల్యాలకు మెడల్స్‌ను బహుకరించేవారు. ఆ తర్వాతి కాలంలో ఈ మెడల్స్ ఇవ్వటం మానేశారు.
వంటవాళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే చెఫ్స్ హ్యాట్‌లో 100 మడతలు ఉంటాయి. కోడిగుడ్లను 100 రకాలుగా వండవచ్చనే విషయాన్ని ఇవి సూచిస్తాయి.
ప్రపంచంలో నాలుగు దేశాల జాతీయ గీతాలకు ఎటువంటి పదాలు లేవు. వీటికి కేవలం ట్యూన్స్ మాత్రమే ఉంటాయి. ఈ దేశాలు- స్పెయిన్, బోస్నియా, హెర్జ్‌గోవినా, కొసావో, శాన్ మెరినో.
ఆకలి లేకపోయినా తినటాన్ని జపనీ్‌సలో - కుచి జమిషి అంటారు. నోరు ఒంటరిగా ఉంటుంది కాబట్టి.. దానికి పని కల్పించాలనే ఉద్దేశంతో కొందరు ఈ పని చేస్తూ ఉంటారు.
అమెరికా రాష్ట్రాల పేర్లలో ఎక్కడ ‘క్యూ’ అనే అక్షరం కనిపించదు.
Updated Date - 2023-11-29T23:42:19+05:30 IST