ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొడుక్కి గుణపాఠం

ABN, First Publish Date - 2023-08-18T02:32:07+05:30

ఒక ఊరిలో ఓ వర్తకుడు ఉండేవాడు. అతని పేరు సోమయ్య. వ్యాపారంతో పాటు వ్యవసాయం చేసేవాడు. అతనికి లేకలేక ఓ కొడుకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెంచాడు. చదివించాడు. బుద్ధి మాటలు చెప్పినా.. ఏనాడూ పట్టించుకోలేదు. ఆ కుర్రోడు పెరిగి పెద్దయ్యాడు.

ఒక ఊరిలో ఓ వర్తకుడు ఉండేవాడు. అతని పేరు సోమయ్య. వ్యాపారంతో పాటు వ్యవసాయం చేసేవాడు. అతనికి లేకలేక ఓ కొడుకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెంచాడు. చదివించాడు. బుద్ధి మాటలు చెప్పినా.. ఏనాడూ పట్టించుకోలేదు. ఆ కుర్రోడు పెరిగి పెద్దయ్యాడు. చెడు స్నేహితుల వెంట తిరిగేవాడు. ఉన్న డబ్బును దానం చేసేవాడు. వ్యసనాలకు లోనై డబ్బులు పోగొట్టుకునేవాడు. అలా చేయకు బాబూ.. డబ్బులు మళ్లీ సంపాదించలేవు అంటూ అనేవాడు. ఏనాడూ తండ్రి మాటను వినేవాడు కాదు.

కొన్నాళ్లకు అప్పులు చేశాడు సోమయ్య కొడుకు. సోమయ్య బాధతో మంచాన పడినా అప్పులు తీర్చాడు. వ్యాపారం, వ్యవసాయం చేయలేకపోయాడు. అప్పులు కట్టడం వల్ల తండ్రి గొప్పదనం తెలిసింది. తండ్రి దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. ‘డబ్బులు సంపాదించటం కష్టం. డబ్బులు సంపాదిస్తే నా డబ్బుతో పాటు ఆస్తినీదే. ముందు లక్ష రూపాయలు సంపాదించు’ అన్నాడు. సవాల్‌గా తీసుకున్నాడు కొడుకు. అతడు చదువుకున్నా.. మొరటుగా ఉండటం వల్ల ఉద్యోగం రాలేదు. నెలపాటు తిరిగితే ఉద్యోగం వచ్చింది. నెలకు పదిహేను వేల రూపాయలు. ఆ జీతం డబ్బులు తీసుకొచ్చి తండ్రికి ఇచ్చేవాడు. అతను ఆ డబ్బులను ఓ డబ్బాలోకి విసిరేసేవాడు. ఇలా మూడు నెలలు జరిగింది. నాలుగో నెల తన తండ్రిమీద కోపంతో అడిగాడు. ‘చూడు బాబూ.. సంతోషం. ఇప్పటికైనా అడిగావు. దయచేసి నా బాధను అర్థం చేసుకో. నువ్వు గతంలో వేలకు వేల రూపాయలు ఖర్చు చేసేవాడివి. నాకు కూడా ఇలా కోపం వచ్చేది. ఏమీ అనలేదు. ఇది నీ ఆస్తి. నీ ఇష్టం. కాపాడుకుంటే నీ ఇష్టం’ అన్నాడు. తండ్రి మాటలతో కొడుకు గుణపాఠం నేర్చుకుని ఆ తర్వాత ఏ తప్పు చేయకుండా జీవించాడు.

Updated Date - 2023-08-18T02:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising