ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Spider inspired: సాలీడు స్ఫూర్తి

ABN, First Publish Date - 2023-06-11T03:52:39+05:30

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఉత్తముడు అనే రాజు ఉండేవాడు. రాజు మంచివాడు. చమత్కారి. మంచి మనసున్న వాడు. ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తున్నారు. కఠినమైన రాజ్యాంగాన్ని అమలుపరిచేవాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఉత్తముడు అనే రాజు ఉండేవాడు. రాజు మంచివాడు. చమత్కారి. మంచి మనసున్న వాడు. ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తున్నారు. కఠినమైన రాజ్యాంగాన్ని అమలుపరిచేవాడు. దారిదొంగలు, దోపిడీ దారులపై ఉక్కుపాదం మోపేవారు. ప్రజలకు పన్నుల భారం లేకుండా చూసుకునేవాడు. అలా సాఫీగా ఉన్న సమయంలో ఆ రాజ్యంపైకి ఇతర సామంతరాజులు కలసి కట్టుగా దాడి చేశారు.

ఉత్తముడు బలశాలి. ధీరుడు. తను అశ్వంమీద వెళ్తుంటే ఎవరూ ఎదుర్కొనలేరు. అంతటి నైపుణ్యం అతనిది. తన అశ్వం కూడా యుద్ధరంగంలో పాల్గొన్నదే. ఇక కత్తితిప్పటంలో అతనికి అతనే సాటి. ఇలాంటి ఉత్తముడు దగ్గర ఉండే సైన్యం మరింత గట్టిగా ఉండేది. వారి విజయధైర్యం చూడటానికి ముచ్చట గొలిపేట్లుండేది. అయితే యుద్ధం. అందునా రాజ్య కాంక్ష. దీంతో సామంతరాజులు కలసి కట్టుగా వచ్చి.. దొంగదెబ్బలు తీశారు. ఉత్తముడు సైన్యం ఊచకోతకు గురైంది. అంత శక్తిమంతుడైన ఉత్తముడు యుద్ధంలో ఉండలేక ఒక గుహకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ రోజు గుహలోనే తనతో పాటు కొందరు సైనికులు ఉన్నారు కాపలాగా. రాత్రంతా రాజుగారికి నిద్రపట్టలేదు. తక్కువ అంచనా వేయటం తగినది కాదని అనుకున్నాడు. తెల్లారుజామున నిద్ర పడుతుందనే సమయంలో ఓ సాలీడు గుహలోని రాయిపైకి నడుస్తోంది. అది కిందపడుతోంది. అయినా మళ్లీ రాయిని పట్టుకుని వేలాడి పైకి వెళ్తోంది. కిందపడటం జరిగినా పైకి వెళ్లటం ఆపలేదు. దీంతో రాజుకు తెలివి వచ్చింది. ఉదయాన్నే రణరంగంలోకి వెళ్లి శతృవులను ఊచకోత కోశాడు.

అంతటి మహారాజు యుద్ధంలో ఉండలేక విలవిల్లాడిపోయాడు. అయితే ఆ సాలీడు పట్టుదల చూసి గుణపాఠం నేర్చుకున్నాడు. అప్పుడు కానీ ఆయనకు అద్భుతమైన విజయం దక్కలేదు. ఆ తర్వాత ఏళ్లపాటు ఆ రాజ్యాన్ని, ఆ సామంతుల రాజ్యాలను కూడా పరిపాలించాడు. ప్రజలు సుభిక్షంగా జీవించారు.

Updated Date - 2023-06-11T04:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising