ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Step Polecat: మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-02-23T22:35:26+05:30

నలుపు, తెలుపు, గోధుమరంగు ఉండే ఈ ముంగిసలాంటి జంతువును స్టెప్‌ పోల్‌క్యాట్‌ అంటారు. మొరాకో, చైనా, రష్యా, మంగోలియా, యూరోపియన్‌ దేశాల్లోని ఉడ్‌ల్యాండ్స్‌లో ఇవి కనిపిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నలుపు, తెలుపు, గోధుమరంగు ఉండే ఈ ముంగిసలాంటి జంతువును స్టెప్‌ పోల్‌క్యాట్‌ అంటారు. మొరాకో, చైనా, రష్యా, మంగోలియా, యూరోపియన్‌ దేశాల్లోని ఉడ్‌ల్యాండ్స్‌లో ఇవి కనిపిస్తాయి.

వీటి పొడవు 53 సెం.మీ. ఉంటే బరువు మాత్రం ఒకటిన్నర కేజీలోపు ఉంటాయి. మగ పోల్‌క్యాట్స్‌ రెండు కేజీల బరువు కూడా ఉంటాయి.

ఇవి చలికాలంలో ఒక చోటనుంచి మరో చోటకు మూవ్‌ కావటానికి ఇష్టపడతాయి. ఆ సమయంలో కనీసం ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్లిపోతాయి. మంచు పడుతోంటే ఇవి మరిం యాక్టివ్‌గా ఉంటాయి.

ఇవి సొంతంగా గూటికోసం మట్టిని తవ్వవు. ఉడుతలు, పెద్ద ఎలుకలు పెట్టిన బొరియలను మరింత విశాలంగా చేసుకుని అక్కడే జీవిస్తాయి.

ఇవి మూడు నుంచి ఆరు పిల్లలను కంటాయి. ఈ పిల్లలకు అడుల్ట్‌ ఏజ్‌ రావటానికి రెండేళ్లు పడతాయి.

ఇవి నీళ్లు ఉండే ప్రాంతాల్లో, నదుల పక్కన నివసించటానికి ఇష్టపడతాయి. చేపలు, నీటి కోళ్లు, ఇతర పక్షులను తిని బతుకుతాయి.

ఆయా దేశాన్ని బట్టి చిన్నపాటి రంగు చేంజ్‌తో ఉంటాయంతే. శునకాలకు, ముంగిసలకు దగ్గరపోలికల్లా ఉంటాయివి.

ఇవి అగ్రెసివ్‌గా వాటి జాతితోనే కొట్లాడుకుంటాయి. ఈ సమయంలో గాయాలపాలవుతుంటాయి కూడా.

ఇవి ఆరునుంచి పధ్నాలుగేళ్ల వరకూ జీవిస్తాయి. వీటి సంతతి అంతరిస్తోంది. ఇవి ముఖ్యంగా వైల్డ్‌డాగ్స్‌, నక్కలకు దొరికి ప్రాణాలు పోగొట్టుకుంటాయి.

Updated Date - 2023-02-23T22:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising