పిల్లలకోడి అమాయకత్వం
ABN, First Publish Date - 2023-07-17T23:06:51+05:30
అడవికి దగ్గరలో ఓ నక్క ఉండేది. ఆ నక్కకు మంది సొమ్ము తినటమంటే ఇష్టం. కింద గూళ్లు పెట్టుకునే పక్షులను చంపి తినేది. వాటి గుడ్లనూ పగలగొట్టేది. దాని అరాచకాలకు అదుపే ఉండేది కాదు.
అడవికి దగ్గరలో ఓ నక్క ఉండేది. ఆ నక్కకు మంది సొమ్ము తినటమంటే ఇష్టం. కింద గూళ్లు పెట్టుకునే పక్షులను చంపి తినేది. వాటి గుడ్లనూ పగలగొట్టేది. దాని అరాచకాలకు అదుపే ఉండేది కాదు. అయితే ఏమీ ఎరగనట్లు అడవిలో తిరిగేది. ఒక రోజు కోడిపెట్ట గుడ్లను కూడా పగలగొడుతుంటే.. కోడిపెట్ట ఆ దృశ్యాన్ని చూసింది. పరిగెత్తుకొచ్చి పొడవపోయింది. నక్క తప్పించుకుని పోయింది.
అబద్ధాలకు, అర్థంలేని మాటలు మాట్లాడేది నక్క. అందుకే దాన్ని నమ్మాలంటే అందరూ భయపడేవాళ్లు. ఒక్కమాటలో ఆ నక్కకు దూరంగా మసలుకునేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పిల్లలకోడి ఆ నక్కకు పరిచయమైంది. ఆ కోడిపెట్ట ఎంతో అమాయకురాలు. దీంతో తనకు అందరూ తెలుసని.. తన గుహకు వస్తే మరింత మంది మిత్రులను కలిపిస్తానన్నది. అక్కడ చాలా బావుంటుందని నమ్మబలికింది. ఇంకోసారి అటుపక్కకు వచ్చినప్పుడు తప్పకుండా వస్తానంది ఆ పిల్లలకోడి.
రెండు రోజుల తర్వాత చేలో నక్క చనిపోయిందని కొందరు జనాలతో పాటు మరికొన్ని జంతువులు గుమికూడాయి. అవి వెళ్లిపోయాయి. నక్క చనిపోయిందని పిల్లలతో వెళ్లింది కోడి. అయ్యోపాపం.. అనుకున్నది కోడి. క్షణాల్లో నక్క నిద్రలేచింది. ఎందుకు ఇలా గుమికూడారని అడిగింది. ‘చనిపోయావేమోన’ని అన్నారంతా. రాత్రి తిన్నది అరగలేదు.
నిద్రపోయానంతే అంటూ మాట్లాడింది. దీంతో అందరికీ కోపం వచ్చింది. అయ్యో.. పాపం.. అన్నది కోడి. ‘నీ కోడిపిల్లలు ఎన్ని’ అన్నది. ‘తొమ్మిది’ అన్నది కోడి. ఒక్కసారి లెక్క పెట్టు అన్నది. లెక్కపెడితే కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి. ఆ మిగిలిన కోడిపిల్లలను నేనే తిన్నాను అన్నద నక్క. క్షణాల్లో కోడితో పాటు కోడిపిల్లలను మింగేసింది నక్క.
Updated Date - 2023-07-17T23:06:51+05:30 IST