Zebra finch: మీకు తెలుసా?
ABN, First Publish Date - 2023-08-20T04:28:55+05:30
ఎర్రటి ముక్కు, కంటి దగ్గర పూసినట్లుండే ఆరెంజి రంగు, కిందభాగం తెలుపు, రెక్కలు బూడిదరంగు, రెక్కల కింద గోధుమరంగులో తెల్లటి చుక్కలు, తోక నలుపు, తెలుపు చుక్కలతో ఉండే ఈ బుజ్జి పక్షి పేరు ‘జీబ్రా ఫించ్’. 1801 సంవత్సరంలో ఆస్ర్టేలియాలో ఈ పక్షిని ఓ పక్షి ప్రేమికుడు కనుగొన్నాడు.

ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో మాత్రమే కనిపిస్తాయివి.
వరి పొలాలు, సవన్నా గడ్డి మైదానాలు, ముఖ్యంగా చెట్లుండి నీళ్లు
దగ్గరగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తాయి.
ఇవి సోషల్ బర్డ్స్. గుంపులు గుంపులుగా ఉంటాయి.
ఈ పక్షులు చెట్లమీద ఎగురుతూ, నేలమీద మట్టి తవ్వుతూ పురుగులు తినటానికి ఇష్టపడతాయి. ముఖ్యంగా మగ పక్షుల స్వరం గట్టిగా ఉంటుంది. ఒక్కోసారి ఐదారు వందల పక్షులు ఒకే చోట కనిపిస్తాయి.
ఇవి రెండు నుంచి ఎనిమిది గుడ్లు పెడతాయి. ఇంక్యుబేషన్ సమయం పద్దెనిమిది రోజులు. పిల్లలు గుడ్లలోంచి వచ్చాక దాదాపు 35 రోజుల పాటు పిల్లలకు ఫీడ్ తెచ్చి పెడతాయి.
మనుషులతో స్నేహంగా ఉంటాయి. వందేళ్లనుంచి పంజరాల్లో పెంచుకుంటున్నారు.
ఈ పక్షులు కేవలం మూడు మిల్లీ లీటర్లు నీటి మాత్రమే తాగుతాయి. ఎండాకాలంలో మాత్రం ఆరు మిల్లీలీటర్ల నీటిని తాగుతాయి.
అది కూడా 3.6 సెకండ్ల లోపే ఆ చుక్క నీటిని తాగి వెళ్లిపోతాయి.
బరువు 12 గ్రాములు. 10 సెం.మీ. పొడవు ఉంటాయి. ఈ పక్షి పుట్టినపుడు గోధుమరంగులో ఉంటుంది.
కూరగాయలు, గింజలు, విత్తనాలు, పురుగులు తిని బతుకుతాయి. పంజరంలో నీళ్ల తొట్టి పెట్టినా మునిగి తనకు తాను శుభ్రపరచుకుని ఉంటుంది.
వీటి జీవనకాలం మూడేళ్లు. అతి తక్కువగా కొన్ని ఐదేళ్లపాటు జీవిస్తాయి.
Updated Date - 2023-08-20T04:28:55+05:30 IST