ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mangoes: మామిడితో మస్త్‌

ABN, First Publish Date - 2023-06-17T04:25:48+05:30

వేసవికాలం అంటేనే మామిడిపండ్లు. ఈ ఏడాదిలో వేసవి చివర్లో ఉన్నాం. ఈ ఎండింగ్‌ టచ్‌లో మామిడికాయల ఫ్లేవర్‌తో చేసిన వంటకాలను ఆస్వాదిద్దాం. ముఖ్యంగా మామిడికాయలతో ఫిర్ని, పనీర్‌ టిక్కా, కట్టా ముర్గ్‌ టిక్కా చేసుకోండిలా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవికాలం అంటేనే మామిడిపండ్లు. ఈ ఏడాదిలో వేసవి చివర్లో ఉన్నాం. ఈ ఎండింగ్‌ టచ్‌లో మామిడికాయల ఫ్లేవర్‌తో చేసిన వంటకాలను ఆస్వాదిద్దాం. ముఖ్యంగా మామిడికాయలతో ఫిర్ని, పనీర్‌ టిక్కా, కట్టా ముర్గ్‌ టిక్కా చేసుకోండిలా...

మ్యాంగో ఫిర్ని

కావాల్సిన పదార్థాలు:

బియ్యం- రెండు టేబుల్‌ స్పూన్లు, బంగినపల్లి మామిడికాయ- 1, పాలు- అరలీటరు, చక్కెర- మూడు టేబుల్‌ స్పూన్లు, డ్రైఫ్రూట్స్‌ మిశ్రమం- రెండు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి- అరటీస్పూన్‌

తయారీ విధానం:

బౌల్‌లోకి బియ్యం వేసి నీళ్లుపోయాలి. బాగా కడిగిన తర్వాత నీళ్లను తీసేయాలి. కడిగిన బియ్యంలో కప్పు నీళ్లు పోసి నలభై నిముషాలు నానబెట్టాలి. ఈ బియ్యాన్ని స్పూన్‌తో తీసి జార్‌లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. గరుకుగా ఉండేట్లు చూసుకోవాలి. ఈ బియ్యం మిశ్రమాన్ని ఒక బౌల్‌లో వేసి పక్కన ఉంచుకోవాలి. మామిడికాయ తొక్కను పీలర్‌తో తీసేసి ముక్కలుగా కట్‌ చేసి మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్‌ను పక్కన ఉంచుకోవాలి.

ప్యాన్‌లో పాలు పోసి పొంగు వచ్చేంత వరకూ వేడిచేయాలి. ఇందులో మిక్సీ పట్టిన బియ్యం రవ్వ వేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కదుపుతూ ఉడికించాలి. ఇలా ఎనిమిది నిముషాల పాటు చేయాలి. బియ్యం రవ్వ సాఫ్ట్‌గా ఉడుకుతుంది. పాలు కాస్త చిక్కపడిన తర్వాత చక్కెర వేసి కదపాలి. దీన్ని గరిటెతో కదుపుతూ ఉండాలి. తీపి కావాలనుకుంటే చక్కెర కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఇక రెండు నిముషాల తర్వాత యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్‌ వేసి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. ఈ ఫిర్నిని చల్లబరిచిన తర్వాత బాగా కలిపి మామిడిపండు పేస్ట్‌ను వేయాలి. మిశ్రమాన్ని కలిపితే సరి మ్యాంగో ఫిర్ని రెడీ. దీన్ని బౌల్‌లోకి వేసుకుని ఫ్రిజ్‌లో రెండు గంటలపాటు ఉంచాలి. తినేప్పుడు డ్రైఫ్రూట్స్‌ వేసి సర్వ్‌ చేసుకోవచ్చు.

కట్టా ముర్గ్‌ టిక్కా

కావాల్సిన పదార్థాలు:

చికెన్‌ లెగ్‌ బోన్‌లెస్‌- కేజీ, ఉప్పు- రుచికి తగినంత, పచ్చిమిర్చి- 3 (సన్నగా కట్‌ చేసుకోవాలి), నిమ్మకాయలు- 4, జింజర్‌ గార్లిక్‌ పేస్ట్‌- టీస్పూన్‌, పెరుగు- 100 గ్రాములు, ఆవనూనె- టీస్పూన్‌, జీలకర్ర పొడి- టీస్పూన్‌, మెంతిపొడి- టీస్పూన్‌, బ్లాక్‌ సాల్ట్‌- కొద్దిగా, వైట్‌ పెప్పర్‌- కొద్దిగా, గరం మసాలా- టీసూన్‌, వెల్లుల్లి- 4 రెబ్బలు, పచ్చి మామిడికాయ-1

తయారీ విధానం:

చికెన్‌ను శుభ్రంగా కడిగి.. చికెన్‌ ముక్కల్లోకి గార్లిక్‌ పేస్ట్‌, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి రాత్రంతా మారినేట్‌ చేసుకుని ఉంచుకోవాలి. వండేప్పుడు ముందు బౌల్‌లోకి పెరుగు, ఆవనూనె, మెంతిపొడి, జీలకర్ర పొడి, బ్లాక్‌ సాల్ట్‌, వైట్‌ పెప్పర్‌, గరం మసాలా వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత మామిడికాయ తురుము వేయాలి. మిక్స్‌ అయ్యేంత వరకూ కలపాలి. ఆ తర్వాత మారినేట్‌ చికెన్‌ తీసుకుని ఆ మసాలాలోకి కలపాలి. ఇందులోకి తరిగిన వెల్లుల్లిపాయలు వేయాలి. చికెన్‌ ముక్కలను సీకర్‌కు గుచ్చి తందూరి పాట్‌లో లేదా కబాబ్‌ పొయ్యిమీద కాల్చుకోవాలి. కట్టా ముర్గ్‌ టిక్కా రెడీ.

Updated Date - 2023-06-17T04:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising