Kitchen Tips: పకోడీ ప్రియులు తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది.. ముట్టుకుంటే నూనె అంటుతోందా..? అయితే..!
ABN, First Publish Date - 2023-08-09T14:13:44+05:30
తక్కువ వేడి నూనెలో, పకోడీలు వేయడం వల్ల అవి అవసరమైన దానికంటే ఎక్కువ నూనెను పీల్చుకోవడం ప్రారంభిస్తాయి.
మధ్యాహ్నమో, సాయంత్రంమో చల్లని వాతావరణంలో లేదా జోరు వానలో పకోడీలు తినాలని మనసు లాగేస్తూ ఉంటుంది. కాస్త ఉల్లిపాయలు, శనగపిండి కలిపి వేడి నూనెలో చిటికెలో చేసే పకోడీలను వేసుకుని తినడానికి ఎవరు ఇష్టపడరు. అయితే.. ఉల్లిపాయల నుంచి బంగాళదుంపలు, క్యాబేజీ, మిరపకాయల వరకు పకోడీలను తయారు చేసుకోవడానికి బడ్జెట్, ఆరోగ్యం పరంగా ఆలోచిస్తే.. వీటిని తయారు చేయడానికి ఉపయోగించే నూనె పకోడీల రుచి చెడిపోకుండా, నూనె కూడా తక్కువ వాడాలా ఒక ట్రిక్ గురించి తెలుసుకుందాం.
తక్కువ నూనెలో పకోడీలను ఎలా తయారు చేయాలి.
తక్కువ వేడి నూనెలో, పకోడీలు వేయడం వల్ల అవి అవసరమైన దానికంటే ఎక్కువ నూనెను పీల్చుకోవడం ప్రారంభిస్తాయి. పకోడీలను వేయించడానికి ముందు నూనె మంచి ఉష్ణోగ్రతకు చేరుకునే వరకూ చిన్న చిన్న బుడగలు రావడం మొదలు పెట్టగానే పకోడీలు వేయించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: అల్యూమినియంతో చేసిందా..? లేక స్టీల్‌దా..? వంట చేసేందుకు అసలు ఏ ప్రెజర్ కుక్కర్ మంచిదంటే..!
నూనెలో వేయండి
పకోడీలను వేయించడానికి ముందు నూనె అవసరమైనంత వేడిగా మారినప్పుడు, అందులో చిటికెడు ఉప్పు వేయాలి. ఇలా చేయడం వల్ల పకోడీలు ఎక్కువ నూనెను పీల్చుకోవు.
నూనె తక్కువగా పడుతుంది.
పకోడీ కోసం వేసే పిండిలో ఎక్కువ నూనె ఉంటుంది. అందుచేత దీనికి కొద్దిగా శనగపిండిలో బియ్యప్పిండి కలుపుకుంటే అంటే మొత్తంలో నాలుగవ వంతు ఉండాలి. లేకపోతే, సరిగా రావు. ఇలా చేయడం వల్ల బాణలిలో వేయించడానికి పెట్టినప్పుడు పకోడీలు నూనె తక్కువగా పీల్చుకుంటుంది.
Updated Date - 2023-08-09T14:13:44+05:30 IST