shakunam: ఇంట్లోంచి వెళ్ళే ముందు ఈ శకునాలు చూస్తున్నారా? దారిలో ఇవి కనిపిస్తే అశుభం జరుగుతుందట..!
ABN, First Publish Date - 2023-03-20T09:53:31+05:30
ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పనికి వెళుతున్నప్పుడు అశుభకరమైన సంఘటనలు జరిగితే
చాలామందికి శకునం చూసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళడం అనేది అలవాటుగా ఉంటుంది. ఇప్పటి రోజుల్లో తలుచుకోగానే బయటకు వెళిపోతున్నాం కానీ పూర్వం అసలు మంచి ఘడియలు చూసుకోనిదే ఏ పని చేసేవారు కాదు. అలాగే శకునం కూడా చూసుకుని మరీ ఇంటి నుంచి బయటకు వెళ్ళేవారు. అలా అంత నిష్టగా ఇప్పటి వాళ్ళు చేయకపోయినా ఇప్పటికీ శకునం చూసుకుని మరీ ఇంటి నుంచి బయటకు వెళ్ళేవారు చాలామందే ఉన్నారు. అయితే ప్రతిరోజూ మనకు భిన్నంగా ఉంటుంది. ఉదయాన్నే ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పనికి వెళుతున్నప్పుడు ఇక అశుభకరమైన సంఘటనలు జరిగితే ఏం చేయాలో అదీ చూద్దాం.
ఖాళీ గిన్నెలు కనిపించాయా?
ఇంటి నుంచి బయటకు వస్తుంటే ఖాళీగా ఉన్న గిన్నె కనిపించిందనుకోండి అది అశుభంగా భావించాలి. అలాగే మరీ ముఖ్యమైన పనిమీద వెళుతున్నారు అనుకోండి కాసేపు కూర్చుని మళ్ళీ బయలుదేరడం మంచిది.
అద్దం పగిలిపోయిందా?
ముఖ్యమైన పనిమీద వెళుతుంటే అద్దంకానీ పగిలిందే అనుకోండి అది అశుభంగానే తీసుకోవాలి. చేయాలనుకున్న పని అప్పటి ఆపేయడం మంచిది. లేదా వాయిదా వేసుకున్నా పరవాలేదు.
ఇది కూడా చదవండి: తులసి మొక్కకు రోజూ నీళ్ళు పోస్తున్నారా? అయితే చాలా నష్టపోతారు..!
కుక్కల పోట్లాట..
ఇంట్లోంచి వెళుతుంటే వీధిలో కుక్కలు గుంపుగా చేరి పోట్లాట మొదలు పెడుతున్నాయనుకోండి. అటు నుంచి మరో వీధికి మరలిపోండి, లేదా వెనక్కు వచ్చేయాలి. లేదంటే అనుకున్న పని జరగదట. అంతే కానీ అదే దారిలో వెళితే ప్రతికూలతలే ఎదురవుతాయట.
ఈ దారిలో నడవకండి.
పని మీద వెళుతున్నప్పుడు మూత్ర విసర్జన లేదా మలవిసర్జన చేసినట్టు కనిపిస్తే దారి మార్చి వెళ్ళడం మంచిది. శకున శాస్త్రం ప్రకారం ఇది అశుభంగా భావిస్తారు. ఇలా ప్రతి విషయానికి శకునం చూసుకోవడం వల్ల ప్రతికూల పరిస్థితులను దాటేయడానికి ఇదో మార్గంగా భావిస్తారు. మీకు కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తే కాస్త పనిని వాయిదా వేసుకోండి మరి.
Updated Date - 2023-03-20T10:01:43+05:30 IST