vastu Tips: ఇంట్లో మానసిక ఆరోగ్యం కావాలంటే..ఈ వాస్తు మార్పులు తప్పనిసరి..!
ABN, First Publish Date - 2023-03-30T12:22:17+05:30
నార్త్ (N)లో స్టోర్‌రూమ్, ఓవర్‌హెడ్ ట్యాంక్ ఉండటం కూడా ఈ సమస్యకు కారణమవుతుంది.
మనం ఇంట్లోకి ప్రవేశించాకా, ఇంటి వాతావరణానికి తగినట్టుగా ప్రశాంతంగా ఉంటే ఇక కావలసిందేముంది. ఆరోగ్యం, మానసిన ప్రశాంతత కోసమే కదా చక్కని ఇంటిని ఏర్పాటు చేసుకుంటాం. అలా కాకుండా ఆత్రుతగా, కోపంగా, చంచలంగా, ఆందోళనగా పరిస్థితులు మారిపోతున్నాయంటే.. దానికి మీరేం చేస్తున్నారు. అసలు ఈ ఇబ్బందులు వాస్తు పరంగా వచ్చాయని మీకు తెలుసా? బయట ఉన్నప్పుడు, రిలాక్స్‌గా, ఆనందంగా ఉంటూ, ఇంటికి రాగానే ఈ పరిస్థితిలో మార్పుకలుగుతున్నట్లయితే, ఇంట్లోని శక్తి ఖచ్చితంగా అసమతుల్యతతో ఉన్నట్లే.. మానసిక ప్రశాంతతను అందించడంలో వాస్తుపరంగా మనం ఏం చేయాలనేది చూద్దాం.
నార్త్ ఈస్ట్ (NE) జోన్ మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ దిశలో చిందరవందరగా, స్టోర్‌రూమ్, పసుపు రంగు, డస్ట్‌బిన్, గ్యాస్ బర్నర్, మొక్కలు ఉండటం పెద్ద అసమతుల్యతను సృష్టిస్తుంది. ఈ జోన్ దాని ప్రతిఫలాన్ని తీవ్రంగా చూపిస్తుంది. ఫలితంగా, దూకుడుగా, మానసికంగా, గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. ఈ దిశను గందరగోళం లేకుండా క్లియర్ చేయాలి.
1. నార్త్ (N)లో స్టోర్‌రూమ్, ఓవర్‌హెడ్ ట్యాంక్ ఉండటం కూడా ఈ సమస్యకు కారణమవుతుంది, ఎందుకంటే ఉత్తరం నీటి మూలక దిక్కు, ఇది నీరు కాకుండా వేరేవి ఉన్నట్లయితే ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పాడు చేస్తుంది.
ఇది కూడా చదవండి: ఇంట్లో స్టోర్ రూమ్‌లో ఉంచకూడని వస్తువులేంటో తెలుసా..? ఇలాంటి వస్తువులు కూడా వాస్తుకు విరుద్ధమే..!
2. సౌత్ (S)జోన్, ఇది అగ్ని జోన్, నీటికి ప్రాతినిధ్యం వహించే నీలం లేదా నలుపు రంగు కారణంగా స్థితిలో మార్పు ఉంటే, ఫలితంగా అశాంతి, తెలియని విషయాల గురించి భయపడతారు.
3. మంచం ఆగ్నేయానికి తూర్పున (ESE) వేసినా కూడా అది ఆందోళన కలిగించే ప్రాంతం కనుక ఇలాంటి ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత, మానసిక ఆరోగ్యం ఉండాలంటే.. సమగ్ర వాస్తు విశ్లేషణ చాలా అవసరం కానీ ఈ జోన్‌లను బ్యాలెన్స్ చేయడం వల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.
Updated Date - 2023-03-30T12:22:17+05:30 IST