ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jesus: పశ్చాత్తాపంతోనే మన్నింపు

ABN, First Publish Date - 2023-04-13T23:37:12+05:30

ఎన్నో క్లిష్టమైన అంశాలను చిన్న చిన్న కథల ద్వారా లోకులకు ఏసు ప్రభువు అందించాడు. మనసు మార్చుకొని, మన్నింపు కోరిన ఒక కుమారుడి కథ కూడా అటువంటిదే:

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దైవమార్గం

ఎన్నో క్లిష్టమైన అంశాలను చిన్న చిన్న కథల ద్వారా లోకులకు ఏసు ప్రభువు అందించాడు. మనసు మార్చుకొని, మన్నింపు కోరిన ఒక కుమారుడి కథ కూడా అటువంటిదే:

ఒక ఊరిలో గొప్ప సంపన్నుడు ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు వ్యవసాయ పనులు చేసేవాడు. చిన్నవాడు విలాసాల్లో కులాసాగా తిరిగేవాడు. ఇతనికి అంటని వ్యసనం అంటూ లేదు. ఆ రెండో కొడుకు ఒక రోజు తండ్రితో ‘‘నా వాటా నాకు ఇచ్చెయ్‌. నేను పరదేశం వెళ్ళి, పెద్ద వ్యాపారినై తిరిగి వస్తాను’’ అన్నాడు. అతని మాటలు నిజమని ఆ తండ్రి నమ్మాడు.

తండ్రి ఇచ్చిన సగం వాటా ఆస్తితో... చిన్న కొడుకు వెళ్ళిపోయాడు. ఏడాది తిరగకుండానే మొత్తం ఖర్చయిపోయింది. దానికి తోడు కరువు వచ్చి పడింది. తినడానికి తిండిలేని పరిస్థితులో... ఒక పందుల యజమాని దగ్గర పనికి కుదిరాడు. కానీ ఎక్కువ రోజులు ఆ పని చెయ్యలేకపోయాడు. ఇల్లు గుర్తొచ్చి, సొంత ఊరికి బయలుదేరాడు. తిరిగి వస్తున్న కుమారుణ్ణి అల్లంత దూరం నుంచి చూశాడు తండ్రి.

‘‘నీ ఎదుట పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుణ్ణని చెప్పుకోడానికి యోగ్యత లేనివాణ్ణి. నన్ను క్షమించు’’ అంటోంది పశ్చాత్తాపతప్తమైన ఆ కుమారుడి హృదయం తప్పు చేసి, నోరు జారాక, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తాపత్రయపడడం నేరం కానీ, చేసినదానికి బాధపడి, దారి మార్చుకొని, స్వభావాన్ని సరిదిద్దుకుంటే... దేవదూతలైనా హర్షించకుండా ఉంటారా?

మరి అలా తప్పు చేసినవారు ఎందరు మార్పు చెంది, కొత్త జీవితం కోసం ఎదురు చూడగలుగుతున్నారు? పాపి ఆ కుమారుడి స్థానంలో ఉన్నప్పుడు. పశ్చాత్తాపం చెందినప్పుడు... దేవుడు తండ్రి స్థానంలో తప్పకుండా ఉంటాడు, ఆ పాపిని మన్నిస్తాడు.

-డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు, 9866755024

Updated Date - 2023-04-13T23:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising