ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంటి దొంగ

ABN, First Publish Date - 2023-07-13T23:35:59+05:30

ఏసు ప్రభువు ఊరూరూ తిరుగుతూ, తనలోని ఆధ్యాత్మిక సంపదను చుట్టూ ఉన్నవారికి పంచుతూ, ప్రజల సమస్యల్ని సమన్వయంతో పరిష్కరించేవాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దైవమార్గం

ఏసు ప్రభువు ఊరూరూ తిరుగుతూ, తనలోని ఆధ్యాత్మిక సంపదను చుట్టూ ఉన్నవారికి పంచుతూ, ప్రజల సమస్యల్ని సమన్వయంతో పరిష్కరించేవాడు. అందుకే ఎప్పుడూ ఆయన చుట్టూ జనం ఉండేవారు. మరోవైపు... ఏసు అంటే అసూయ ఉన్న యూదా ప్రధాన యాజక బృందం ఆయనను ఒంటరిగా పట్టుకోవడానికి ప్రయత్నించేది.

వాస్తవానికి ఏసు ప్రభువు ఏకాంతాన్ని కల్పించుకొనేవాడు. కొండల్లోకి, కోనల్లోకి వెళ్ళి... పరలోకంలోని తన తండ్రితో యథేచ్ఛగా మనసు విప్పి విషయాలు విన్నవించేవాడు, ప్రార్థించేవాడు.

ఒకసారి గెత్సేమనే తోటలో ఆయన దేవునితో సంభాషించాడు. ప్రజల పరిస్థితిపై ఆవేదన చెందాడు. తరువాత ‘‘కాస్త మెలకువతో ఉండండి’’ అని తన శిష్యులను హెచ్చరించాడు.

ఇంతలో ఒక పెద్ద జనసమూహం గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకుంది. ఏసు పన్నెండు మంది శిష్యులలో ఒకరైన యూదా అందరి కన్నా ముందు వేగంగా వచ్చి, ఏసును ముద్దు పెట్టుకోడానికి ఆత్రుత పడ్డాడు. అప్పుడు ఏసు అతనితో ‘‘యూదా! ఒక్క ముద్దుతో నన్ను నువ్వు అప్పగిస్తున్నావా?’’ అన్నాడు. యూదాతో పాటు వచ్చిన మనుషులు తనను గుర్తు పట్టడం కోసమే... యూదా ఆ పని చేసినట్టు ఏసు గ్రహించే ఆ మాట అన్నాడు.

వెంటనే ఆయన చుట్టూ ఉన్నవారు ‘‘యూదాను నరికేయమంటారా ప్రభూ!’’ అంటూ ముందుకొచ్చారు.

ఈలోగా, ఏసుపై దాడి చేయడానికి ప్రధాన యాజకుడు పంపగా వచ్చిన మల్కు అనే సేవకుణ్ణి... ఏసు పక్కనే ఉన్న సీమోను పేతురు కొట్టాడు. తన దగ్గర ఉన్న కత్తితో మల్కు చెవిని నరికేశాడు.

ఇది చూసిన ప్రభువు ‘‘మీకు ఈ మాత్రం ఓర్పు లేదా?’’ అంటూ ఆ చెవి తీసుకొని, యథాస్థానంలో తిరిగి అతికించాడు. కీడు చేయడానికి వచ్చిన వ్యక్తికి ఆయన చేసిన ఉపకారాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

అప్పుడు ఏసు తనను బంధించడానికి వచ్చిన వారితో ‘‘అనుదినం మీ చెంత ఆలయంలో ఉన్నప్పుడు నన్ను మీరు పట్టుకోలేదు. ఇప్పుడు అధికారం వల్ల అజ్ఞానాంధకారంలో పడ్డారు’’ అంటూ వారికి సహకరించి పట్టుబడ్డాడు.

శత్రువులు ఎక్కడో ఉండనవసరం లేదు. మన సన్నిహితుల్లోనో, సహచరుల్లోనో కూడా ఉండవచ్చు. అయితే తనపై దాడి చేసిన వ్యక్తికి స్వస్థత చేకూర్చి, తనను పట్టివ్వాలనుకున్న ఇంటిదొంగ యూదా ప్రయత్నం సైతం నెరవేరేలా చేసిన మహోన్నతుడు ఏసు క్రీస్తు.

-డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు

9866755024

Updated Date - 2023-07-13T23:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising