ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JILEELA MUDI AMMA: సేవలోని తృప్తే ముక్తి

ABN, First Publish Date - 2023-02-09T23:21:09+05:30

ఉపదేశాలు, సందేశాలు ఇవ్వడం కన్నా ఆచరణాత్మకమైన వైఖరే సమాజానికి మేలు చేస్తుందని జిల్లెళ్ళమూడి అమ్మ స్థిరంగా నమ్మేవారు. గుంటూరు జిల్లాలోని జిల్లెళ్ళమూడిలో ఆమె ఏర్పాటుచేసిన ‘అన్నపూర్ణాలయం’ ఎంతో మంది ఆకలి తీరుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపదేశాలు, సందేశాలు ఇవ్వడం కన్నా ఆచరణాత్మకమైన వైఖరే సమాజానికి మేలు చేస్తుందని జిల్లెళ్ళమూడి అమ్మ స్థిరంగా నమ్మేవారు. గుంటూరు జిల్లాలోని జిల్లెళ్ళమూడిలో ఆమె ఏర్పాటుచేసిన ‘అన్నపూర్ణాలయం’ ఎంతో మంది ఆకలి తీరుస్తోంది. ‘విశ్వజనని’గా విఖ్యాతి పొందిన అమ్మ... సేవా కార్యక్రమాలను అమితంగా ప్రోత్సహించేవారు.

ఒకసారి విజయనగరం నుంచి ఒక ప్రసిద్ధమైన క్లబ్‌కు చెందిన సభ్యులు అమ్మ దగ్గరకు వచ్చారు. ‘‘మాకు ఏదైనా సందేశం ఇవ్వమ్మా’’ అని అడిగారు.

దానికి అమ్మ బదులిస్తూ... ‘‘చేయవలసింది చాలా ఉంది నాన్నా! అనాథలు, అంగవైకల్యంతో బాధపడుతూ... ఎలాంటి ఆధారం లేనివారు చాలామంది ఉన్నారు. వారందరినీ ప్రేమగా చూడండి. చేయూత అవసరమయ్యేది తమ కాళ్ళమీద తాము నిలబడలేని వారికే కదా! అటువంటివారికి ఆసరాగా ఉండండి. కానీ ఇదంతా వారి మీద జాలితో చేస్తున్న సహాయం అనుకోకండి... వారిని భగవత్‌ స్వరూపులుగా భావించి సేవ చెయ్యండి. అటువంటి సేవ ద్వారా కలిగే తృప్తే... ముక్తి’’ అని సందేశం ఇచ్చారు. ‘నీకు ఉన్నది తృప్తిగా తినడం, ఇతరులకు ఆదరంగా పెట్టడం అనేది ఒక్క భోజనం విషయంలోనే జరుగుతుంద’ని ఆమె తరచుగా చెప్పేవారు.

ముక్తికి సులభమైన మార్గాన్ని ఒక సందర్భంలో ఆమె వివరిస్తూ ‘‘కాలంతో పాటు మనమూ మారాలి. పూర్వకాలంలో ఒక రూపాన్నో, నామాన్నో, భావాన్నో ఆధారం చేసుకొని... మనిషి తరించేవాడు. అయితే ఈ విధానం ఎప్పుడూ ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. అది వ్యక్తిగతమైన సాధన. అంతకన్నా సులువైన మార్గం మరొకటుంది. అదే పదిమంది కోసం... పదిమందితో కలిసి పని చెయ్యడం. అలాగే మమకారాన్ని చంపుకోకుండా పెంచుకోవడం, పరిమితంగా ఉన్న ప్రేమను విస్తృతం చేసుకోవడం... ఇదే నేటి మానవ ధర్మం అని నేను అనుకుంటున్నాను. మానవుడు మాధవుడిగా మారడానికి ఇది మంచి మార్గం’’ అని సందేశం ఇచ్చారు.

భారతీయ ధార్మిక జీవనానికి పునాది వైవాహిక వ్యవస్థ. సమాజంలోని సర్వ ధర్మాలకూ కేంద్ర బిందువుగా గృహస్థాశ్రమాన్ని పెద్దలు పేర్కొన్నారు. ఆ ఆశ్రమంలో ప్రవేశించడానికి నిర్వహించే వైదిక సంస్కారమే వివాహం. అయితే ఆధునిక కాలంలో చిన్న చిన్న కారణాలకే దంపతులు విడిపోతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడం అసాధారణమైన వ్యక్తులకూ, వారి ఉపదేశాలకే సాధ్యం. అటువంటి ఉపదేశాలెన్నిటినో అమ్మ ప్రవచించారు. ‘కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా అర్పించడమే కళ్యాణం’, ‘ఒక పెన్నిధి అండన చేరడమే పెండ్లి’ అంటూ వైవాహిక వ్యవస్థ గురించి స్పష్టమైన నిర్వచనాలను ప్రకటించారు.

అమ్మలోని ఆధ్యాత్మికమైన విశిష్టతను, ప్రత్యేకతను గుర్తించిన ఆమె చినతాతగారైన చిదంబరరావు ‘‘నీకు పెండ్లి ఎందుకమ్మా!’’ అని అడిగితే...

‘‘లోకంలో ఉన్న కష్టాలన్నిటినీ భరిస్తూ, సంసార జీవితాన్ని ఎలా సాగించాలో లోకానికి నేర్పడం కోసమే!’’ అని అమ్మ సమాధానం ఇచ్చారు.

-డాక్టర్‌ బి.ఎల్‌.సుగుణ

Updated Date - 2023-02-09T23:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising