Spiritual Stories: కాళీమాత పాదాల కింద శివయ్య.. ఈ ఫొటోను చాలా మంది చూసే ఉంటారు కానీ.. చాలా మందికి తెలియని నిజాలివీ..!
ABN, First Publish Date - 2023-05-26T17:21:49+05:30
ఆమెనే కాళిగా మారి రక్తబీజులను సంహరించే పని పట్టింది. రక్తబీజుని తల నరికి అతని రక్త బిందునులు నేలను చేరకుండా కింద పళ్ళాన్ని ఉంచింది.
దేవునికి ఆకారం లేదనేది కొందరి వాదనైతే, రకరకాల ఆకారాల్లో భగవంతుని సేవించడం భక్తుల నమ్మకం. నిరాకారుడని, ఆకారుడని ఎన్ని చెప్పినా దేవుని రకరకాల రూపాలలో చూసి అలంకరించి, పూజించి ఆనందపడతారు భక్తులు. అయితే ప్రశాంతంగా ఉండే భగవంతుని ఫోటోలలో కొన్ని మనసుకు హత్తుకుపోతూ ఉంటాయి. అందులో కాళీకా దేవి పాదాల చెంత శివుని ఫోటో ప్రత్యేకంగా కనిపిస్తూ, భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ ఫోటో వెనుక ఉన్న కథ కూడా కాస్త భిన్నంగానే ఉంటుంది.
కాళీ ఉగ్రరూపం..
రక్త బీజుడనే రాక్షసుడు తపస్సుతో బ్రహ్మదేవుని నుంచి గొప్ప వరాన్ని పొందుతాడు. తన రక్తపు చుక్క భూమి మీద పడితే వెయ్యిమంది రక్తబీజులు పుట్టుకొచ్చేలా వరం అది. దీనితో మరింత క్రూరంగా మారి మునులను, సాధువులను , ప్రజలను అందిరినీ ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాడు. దేవతలు ఈ బాధలు పడలేక బ్రహ్మకు, విష్ణువుకు మొరపెట్టుకుంటారు.
ఇది కూడా చదవండి: గుళ్లల్లో ఇచ్చే హారతి వెనుక ఇంత కథ ఉందా..? పూజ చేసిన తర్వాతే హారతిని ఎందుకు ఇస్తారంటే..!
త్రిమూర్తులు ఈ విషయంలో దుర్గామాత సాయం కోరుతారు. ఆమె రక్తబీజుడితో యుద్ధం చేయడానికి వెళుతుంది. రాక్షస గమాలను అందరినీ అంతం చేసి బ్రహ్మ ఇచ్చిన వరంతో రక్తబీజుడి ఒంటి నుంచి ఒక్క చుక్క భూమిమీద పడిన తక్షణం రక్తబీజులు పుట్టుకురావడం దుర్గామాత వారిని సంహరించడం దీనితో ఆమెలోని శాంతమూర్తి స్థానంలో ఉగ్ర మూర్తి మేల్గొంది. ఆమెనే కాళిగా మారి రక్తబీజులను సంహరించే పని పట్టింది. రక్తబీజుని తల నరికి అతని రక్త బిందునులు నేలను చేరకుండా కింద పళ్ళాన్ని ఉంచింది. దాంతో అతని రక్తం కింద పడకుండా చేయగలిగింది. దీనితో రక్తబీజుడు మరణిస్తాడు.
రక్త ప్రభావం..
రక్తబీజుడి రక్త ప్రభావంతో కాళి కరాళనృత్యం చేయడం మొదలు పెడుతుంది. భూమిపై ఆమె వేస్తున్న ఒక్కో అడుగుతో వినాశనం జరుపుతూ వచ్చింది. ఆమెను శాంతింపజేసేందుకు శివుడు ఆమె పాదాల దగ్గరకు చేరతాడు. స్పృహలోనికి వచ్చిన కాళి తన పాదాల దగ్గరున్న భర్త పరమేశ్వరుడిని చూసి క్రమంగా శాంతిస్తుంది. అమ్మవారి ఉగ్రరూపం శాంతించే క్రమంలో రూపుదిద్దుకున్న చిత్రమే మనం చూస్తున్న చిత్రం. ఇదీ ఈ ఫోటో వెనుకున్న కథ.
Updated Date - 2023-05-26T17:21:49+05:30 IST