Vastu relationship: సుఖమయ జీవితానికి వాస్తు పాత్ర పెద్దదే..జీవితం సాఫీగా సాగేందుకు ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే చాలట..!
ABN, First Publish Date - 2023-04-06T12:22:44+05:30
కాంతిని ఎక్కువగా ప్రసరించే విధంగా లైటింగ్‌ను ఉపయోగించాలి.
వాస్తు శాస్త్రం జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పర్యావరణంలోని సహజ అంశాలను సమన్వయం చేస్తుందని నమ్మాలి. ఆధునిక కాలంలో సంబంధాలను కొనసాగించడంలో ఉన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, వాస్తు సంబంధాలలో నాణ్యతను మెరుగుపరుస్తుంది. వాస్తు నిపుణుడు చెప్పేదాన్ని బట్టి, భావోద్వేగాలు, ప్రవర్తనలను ప్రభావితం చేస్తుందని వివరించారు. అందువల్ల, సాధారణ గృహాన్ని వాస్తుకు తగ్గట్టుగా సర్దుబాట్లు చేయడం వల్ల ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. ఒకరి జీవితంలో ప్రేమను, సామరస్యాన్ని తీసుకురావచ్చు. జీవితాన్ని మెరుగుపరిచేందుకు సహకరించే వాస్తు చిట్కాలు ఇవే..
బెడ్ రూమ్ స్థానం
పడకగది దంపతులకు అత్యంత ముఖ్యమైన గది, ఎందుకంటే ఎక్కువ సమయం కలిసి గడిపే ప్రదేశం అదే కనుక. వాస్తు ప్రకారం, మాస్టర్ బెడ్ రూమ్ ఇంటికి నైరుతి మూలలో ఉండాలి. ఇది సంబంధంలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. తలను దక్షిణం లేదా తూర్పు వైపు ఉంచాలి. నేరుగా తలుపు లేదా అద్దానికి ఎదురుగా ఉండకూడదు. నైరుతిలో పడకగది సాధ్యం కాకపోతే, దానిని దక్షిణం, తూర్పు లేదా పడమరలో ఉంచవచ్చు.
రంగులు
బెడ్ రూమ్ రంగులుమానసిక స్థితి, శక్తిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. పడకగదిలో పింక్, పీచు , పసుపు వంటి పాస్టెల్ షేడ్స్ ఉండాలి. చంచలత్వం, దూకుడు భావాన్ని సృష్టించగల ప్రకాశవంతమైన బోల్డ్ రంగులను ఉపయోగించడం మానుకోవాలి.
ఇది కూడా చదవండి:
హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా ఈ రంగు దుస్తులు ధరించకూడదా? లేదంటే.. ప్రతికూల ఫలితాలు తప్పవా!
గందరగోళం..
చిందరవందరగా, అస్తవ్యస్తంగా ఉన్న స్థలం సంబంధంలో ఒత్తిడి, ఉద్రిక్తతకు దారితీస్తుంది. ప్రశాంతత , సామరస్య భావాన్ని పెంపొందించడానికి పడకగదిని శుభ్రంగా వాస్తు శాస్త్రం చెబుతుంది.. ఏదైనా ఉపయోగించని వస్తువులు లేదా ఫర్నీచర్‌ను తీసేయండి. విశ్రాంతి, సాన్నిహిత్యాన్ని ప్రోత్సహించే ప్రశాంత వాతావరణాన్ని ఇంట్లో సృష్టించండి. ఉపయోగించని బట్టలు, గృహోపకరణాలతో ఇంటిని నింపేయడం మానుకోవాలి.
అద్దాలు
అద్దాలు ఒక ప్రదేశంలో శక్తిని ప్రతిబింబిస్తాయనినమ్ముతారు. పడకగదిలో అద్దాలను ఉంచకూడదు. ఎందుకంటే అవి అశాంతిని సృష్టించగలవు. భార్యాభర్తల మధ్య సామరస్యానికి భంగం కలిగిస్తాయి. పడకగదిలో తప్పనిసరిగా అద్దం ఉంటే, కనక అది మంచానికి మరో మూలలో ఉండేలా చూసుకోవాలి.
లైటింగ్
సరైన లైటింగ్ ఇంట్లో శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. పడకగదిలో లైట్ గా కాస్త కాంతిని ఎక్కువగా ప్రసరించే విధంగా లైటింగ్‌ను ఉపయోగించాలి. అది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. వాస్తు ప్రకారం, ఇంటికి నైరుతి మూలలో బరువులు ఉంచరాదు. ఇది ప్రేమ, వివాహం, భాగస్వామ్యాలతో తగాదాలను తెస్తుంది. వాస్తు ప్రకారం ఇంటికి ప్రధాన ద్వారం దాటాకా దంపతుల ఫోటో ఉంచడం మంచిది. ఇలా చిన్న చిన్న మార్పులతో జీవితంలో ఆనందాన్ని, ప్రశాంతతను తెచ్చుకోండి.
Updated Date - 2023-04-06T12:22:44+05:30 IST