ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Regret: పశ్చాత్తాపం

ABN, First Publish Date - 2023-06-09T02:40:49+05:30

పూర్వం సుభిక్షమైన ఒక రాజ్యం ఉండేది. దాని పాలకుడు నీతిపరుడు, దైవభీతి కలిగినవాడు. ఎల్లప్పుడూ ప్రజలు రాజును ఎంతో ఇష్టపడేవారు. అయితే ‘‘నా రాజ్యంలో ఎవరైనా ఆకలితో బాధపడుతున్నారా? ఇతర కష్టాలేవైనా ఎదుర్కొంటున్నారా? నా పాలన గురించి ఏమనుకుంటున్నారు?’’ అని రాజు నిరంతరం ఆలోచించేవాడు. మారువేషంలో పర్యటించి, రాజ్యంలో జరిగే సర్వ విషయాలనూ తెలుసుకొనేవాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సందేశం

పూర్వం సుభిక్షమైన ఒక రాజ్యం ఉండేది. దాని పాలకుడు నీతిపరుడు, దైవభీతి కలిగినవాడు. ఎల్లప్పుడూ ప్రజలు రాజును ఎంతో ఇష్టపడేవారు. అయితే ‘‘నా రాజ్యంలో ఎవరైనా ఆకలితో బాధపడుతున్నారా? ఇతర కష్టాలేవైనా ఎదుర్కొంటున్నారా? నా పాలన గురించి ఏమనుకుంటున్నారు?’’ అని రాజు నిరంతరం ఆలోచించేవాడు. మారువేషంలో పర్యటించి, రాజ్యంలో జరిగే సర్వ విషయాలనూ తెలుసుకొనేవాడు.

ఒక రోజు ఉదయం ఫజర్‌ నమాజ్‌ ముగించిన ఆ రాజు, అతని మంత్రి మారువేషాల్లో గుర్రాల మీద బయలుదేరారు. మారుమూల ఉన్న ఒక చిన్న గ్రామంలో ప్రవేశించారు. అక్కడ అయిదుగురు దొంగలను సిపాయిలు బంధించి, సమీప పట్టణంలోని కారాగారానికి తీసుకువెళ్తున్నారు. మారువేషాల్లో ఉన్న రాజును, మంత్రిని ఆ సిపాయిలు గుర్తుపట్టలేదు. ఆ అయిదుగురు దొంగలను కారాగారానికి వాళ్ళు అప్పగించారు.

కొంత సమయం తరువాత... ఆ కారాగారాన్ని రాజు తన మామూలు రూపంలోనే సందర్శించాడు. ఆ అయిదుగురు దొంగలను ఖైదు చేసిన గదికి వెళ్లాడు. రాజును చూడగానే నలుగురు ఖైదీలు రాజు చుట్టూ చేరి ‘‘మేము ఎలాంటి నేరం చెయ్యలేదు. అనవసరంగా మా మీద నేరాలు మోపి, కారాగారంలో బంధించారు. మా జీవితాలు ఛిన్నాభిన్నం అయిపోయాయి’’ అని మొత్తుకున్నారు. ఒక ఖైదీ మాత్రం గదిలో ఒక మూల సాష్టాంగపడి, ప్రార్థన చేస్తూ, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. రాజు ఆ ఖైదీ దగ్గరకు వెళ్ళాడు. అతని వీపు మీద తట్టాడు. ప్రార్థనలో ఉన్న ఆ ఖైదీ లేచి ఎదురుగా ఉన్న రాజును చూసి ఆశ్చర్యపోయాడు. సలామ్‌ చేశాడు.

‘‘ఏం జరిగిందో చెప్పు’’ అని అడిగాడు రాజు.

‘‘నా ఆరోగ్యం సరిగ్గా లేదు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. రెండు రోజుల పాటు పస్తులు ఉన్నాం. మా పొరుగున ఉన్న వ్యక్తి శ్రీమంతుడు. నా ఇంటి వాకిలి పక్కనే అతని పండ్ల చెట్లు ఉన్నాయి. గాలికి కొన్ని పండ్లు నా వాకిట్లో పడ్డాయి. నేను మధ్యాహ్నం నమాజ్‌ ముగించి వచ్చేసరికి... పిల్లలు ఆకలి తట్టుకోలేక ఏడుస్తున్నారు. వాకిట్లో పడిన పండ్లలో కొన్నిటిని తీసుకొచ్చి పిల్లలకు ఇచ్చాను. మిగిలిన పండ్లు గంపలో పెట్టి... ఆ చెట్టు యజమానికి ఇచ్చేశాను. అయితే నా పిల్లలకు కొన్ని ఇచ్చిన సంగతి అతనికి చెప్పలేదు. కొన్నాళ్ళ తరువాత ఆ విషయం అతనికి తెలిసింది. అధికారులకు ఫిర్యాదు చేశాడు. సిపాయిలు వచ్చారు. నన్ను జైల్లో పెట్టారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇతరుల వస్తువుల మీద ఆశపడ్డాను. నేను చేసింది దొంగతనం. నేను మరణించిన తరువాత... హషర్‌ మైదానంలో అల్లాహ్‌కు ఏ సమాధానం చెప్పాలి? అందుకే నమాజ్‌ చదివి, పశ్చాత్తాపంతో అల్లాహ్‌ను క్షమాపణ కోరుకుంటున్నాను’’ అంటూ ఆ ఖైదీ ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నాడు.

అతను తప్పు చేసినందుకు కుమిలిపోతున్నాడని రాజు గ్రహించాడు. భవిష్యత్తులో ఎలాంటి తప్పూ చేయకూడదనే భావం అతనిలో రాజుకు కనిపించింది. వెంటనే సిపాయిలను పిలిచి ‘‘ఇతణ్ణి మర్యాదగా ఇంటి వరకూ దిగపెట్టి రండి’’ అని ఆజ్ఞాపించాడు. ఆ ఖైదీ దేవునికి కృతజ్ఞతలు చెప్పి, రాజుకు సలామ్‌ చేసి, ఇంటికి బయలుదేరాడు.

రాజు అక్కడికక్కడే సాష్టాంగపడి ‘‘నా రాజ్యంలో ఎంతో మంది ఆకలితో బాధపడుతున్నారు. ఆ విషయం నేను తెలుసుకోలేకపోయాను. అల్లాహ్‌! నన్ను క్షమించు’’ అని వేడుకున్నాడు. విడుదలైన ఖైదీ ఇంటికి స్వయంగా సరుకులను తీసుకువెళ్ళి ఇచ్చాడు. రాజ్యంలో ఎవరికీ ఆహారానికి లోటు లేకుండా చర్యలు చేపట్టాడు.

• మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2023-06-09T02:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising