ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shri Maharudra Yagam: శ్రీ మహారుద్ర యాగం

ABN, First Publish Date - 2023-07-28T04:03:42+05:30

విశేష ఫలితాలను అందించే యాగ క్రతువుల్లో శ్రీ మహారుద్రయాగం ఒకటి. దీనిలోభాగంగా మూడు రోజుల వ్యవధిలో 33 మంది ఋత్విక్కులు 1331 సార్లు రుద్ర పారాయణ అభిషేకాలు, తత్‌ దశాంశ రుద్ర హోమం నిర్వహిస్తారు.

సమాచారం

విశేష ఫలితాలను అందించే యాగ క్రతువుల్లో శ్రీ మహారుద్రయాగం(Shri Maharudra Yagam) ఒకటి. దీనిలోభాగంగా మూడు రోజుల వ్యవధిలో 33 మంది ఋత్విక్కులు 1331 సార్లు రుద్ర పారాయణ అభిషేకాలు, తత్‌ దశాంశ రుద్ర హోమం నిర్వహిస్తారు. అధిక శ్రావణ బహుళ ఏకాదశి నుంచి మూడు రోజుల పాటు (2023 ఆగస్టు 11 నుంచి 13వ తేదా వరకూ) జరగబోయే ఈ విశిష్టమైన యాగానికి తెలంగాణలోని భువనగిరి జిల్లా కొలనుపాక గ్రామంలోని శ్రీమాతాపితృ గోక్షేత్రం వేదిక కాబోతోంది. అధిక శ్రావణ మాసంలో జప తపాలు, హోమాలు, దానాలు, అభిషేకాలు చేస్తే అధిక ఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయని గోక్షేత్రం అధ్యక్షుడు బిజుమళ్ళ బిందుమాధవ శర్మ సిద్ధాంతి(Bijumalla Bindumadhava Sharma Siddhanti) పేర్కొన్నారు. మహారుద్ర యాగం పులి సీతారామశర్మ ఆధ్వర్యంలో జరుగుతుందనీ, దీనిలో భాగంగా గోక్షేత్రంలో కొలువైన శ్రీగోపాలకృష్ణ స్వామికి అభిషేకం, వివిధ సమస్యల పరిష్కారాల కోసం, అభీష్ట సిద్ధి కోసం లక్ష్మీ గణపతి, స్వయంవర పార్వతి, సంతాన గోపాలకృష్ణ హోమాలను నిర్వహిస్తున్నామనీ ఆయన వివరించారు. లోక కల్యాణంతోపాటు కోరిన కోర్కెలు తీర్చే ఈ పవిత్ర క్రతువుల్లో పాల్గొనాలనుకొనేవారు 9985442000 ఫోన్‌ నెంబర్‌లో సంప్రతించి, రుసుములు, విధివిధానాల గురించి తెలుసుకోవచ్చని సూచించారు.

Updated Date - 2023-07-28T05:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising