తేజోవంతుల నైజం
ABN, First Publish Date - 2023-07-14T00:00:57+05:30
‘సింహం చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా దాన్ని రెచ్చగొడితే ఊరుకోదు. ఎదురుగా ఉన్నది మదగజం అయినా వెనక్కు తగ్గదు.
సింహః శిశురపి నిపతతి మదమలిన కపోల భిత్తిషు గజేషు
ప్రకృతి రియం సత్త్వవతాం న ఖలు వయ స్తేజసాం హేతుః
పరాక్రమవంతుల నైజాన్ని భర్తృహరి తన నీతి శతకంలోని ఈ శ్లోకంలో వర్ణించాడు.
విదిలింప నుఱుకు సింగపు
గొదమయు మద మలిన గండ కుంజరములపై
నిది బలశాలికి నైజము
గద! తేజోనిధికి వయసు కారణమగునే? అంటూ దాన్ని తెలుగులోకి ఏనుగు లక్ష్మణ కవి అనువదించారు.
‘‘సింహం చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా దాన్ని రెచ్చగొడితే ఊరుకోదు. ఎదురుగా ఉన్నది మదగజం అయినా వెనక్కు తగ్గదు. దాని మీదకు ఎగిరెగిరి పడుతుంది. తన సాహసాన్ని ప్రదర్శిస్తుంది. తేజోవంతులకు, బలవంతులకు వయసుతో పని లేదు. ఎంతటి సవాలు ఎదురైనా తలవంచరు. అది వారి సహజ స్వభావం’’ అని భావం.
Updated Date - 2023-07-14T00:00:57+05:30 IST