ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shri Krishna Janmashtami: కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉంటున్నారా..? అసలేం చేయొచ్చు..? ఏమేం చేయకూడదంటే..!

ABN, First Publish Date - 2023-09-05T13:12:01+05:30

శ్రీకృష్ణునికి పాలతో చేసిన వస్తువులతో ఇంట్లోనే ప్రసాదాన్ని తయారు చేయండి.

Kanha ji’s birthday.

కృష్ణుడు పుట్టిన రోజునే కృష్ణాష్టమిగా జరుపుకుంటూ ఉంటాం. ఈ పర్వదినాన్ని ఈ సంవత్సరం రెండు రోజుల్లో జరుపుకునే విధంగా పంచాగ కర్తలు, పండితులు స్పస్టత ఇచ్చారు. భక్తుల్లో గందరగోళానికి తెర దింపుతూ, ఈనెల 6, 7 తేదీలలో నక్షత్రం ఉండటం, ప్రత్యేకత, సంప్రదాయం గురించి వివరిస్తున్నారు. జన్మాష్టమి సెలవు ఆరవ తేదీగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి. ఆరోజున చేయాల్సిన పనులులేమిటి.. చేయకూడని పనులేమిటి అనే దానిమీద చాలామందికి కలిగే సందేహాలను గురించి తెలుసుకుందాం.

జన్మాష్టమి అనేది ఒక పవిత్రమైన హిందూ పండుగ, దీనిని ప్రతి సంవత్సరం గొప్ప కోలాహలంగా, ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రోజున, విష్ణువు, వసుదేవుడు, దేవకిలకు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. భక్తులు వివిధ ఆచారాలు, ఉత్సవాలు అనుసరించి, శ్రీకృష్ణునికి స్పరించుకుంటూ, ఈ రోజును కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 6, సెప్టెంబరు 7 న జరుపుకుంటున్నారు. ప్రత్యేకంగా ఈరోజున చాలా మంది భక్తులు 24 గంటల ఉపవాసం పాటించి, అర్ధరాత్రి భోగ్ (కృష్ణుడికి వడ్డిస్తారు)తో ఉపవాసాన్ని విరమిస్తారు. ఉపవాసం ఉండే భక్తులు ముఖ్యంగా అనుసరించాల్సిన కొన్ని చేయవలసినవి, చేయకూడనివి పనుల గురించి తెలుసుకుందాం.

చేయవలసినవి: శ్రీకృష్ణునికి , పూర్తి అంకితభావాన్ని తెలుపుతూ, ఉపవాసాన్ని ప్రారంభించాలి. భగవద్గీత చదవడం, కృష్ణ మంత్రాలను పఠించడం, భజనలు పాడడం వంటి భక్తి కార్యక్రమాలలో పాల్గొనాలి. ఆలయాన్ని సందర్శించాలి, ప్రార్థనలు చేయాలి, ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ప్రత్యేక జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనండి.

జన్మాష్టమి నాడు ముందుగా శక్తిని పెంచడానికి అధిక ఫైబర్ ఆహారాలను ఎంచుకోవాలి, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు శక్తిని కోల్పోకుండా చూస్తాయి.

పాలు, వెన్న తీసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే ఇవి శ్రీకృష్ణుడికి అనుకూలమైన ఆహార పదార్థాలు. అవి లేకుండా, పండుగ అసంపూర్ణంగా ఉంటుంది. శ్రీకృష్ణునికి పాలతో చేసిన వస్తువులతో ఇంట్లోనే ప్రసాదాన్ని తయారు చేయండి.

పేదవారికి ఆహారం, దుస్తులు దానం చేయడం, ఇటువంటి పనులు కరుణ, నిస్వార్థత కృష్ణుడి బోధనల స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి.

ఇది కూడా చదవండి: ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేయాల్సి వస్తోందా..? అయితే ఫ్రిడ్జ్‌లో మాత్రం వీటిని అస్సలు ఉంచొద్దు..!


చేయకూడనివి: ఇంట్లో సరైన పారిశుధ్యం ఉండేలా చూసుకోవాలి. శుభ్రమైన పాత్రలలో ప్రసాదాన్ని తయారుచేయాలి. అన్ని రకాల మాంసాహార ఆహారాలకు దూరంగా ఉండాలి.

జన్మాష్టమి ఉపవాసం భోజనంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిని మినహాయించండి. ఎందుకంటే అవి తామసికంగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున వీటిని తీసుకోకపోవడం మంచిది. అలాగే టీ, కాఫీ వంటి పానీయాలకు దూరంగా ఉండండి. ఈరోజున ముఖ్యంగా ఏది తీసుకున్నా సరే ప్రతిదీ మితంగా తినండి.

అలాగే, తక్కువ వేయించిన, నూనె తగ్గించి ఆహారాన్ని తినండి. ఎందుకంటే అవి గుండె ఆరోగ్యానికి హానికరం.

చుట్టూ సానుకూల వాతావరణాన్ని ఉంచేలా, తగాదాలు, చెడు మాటలు, ప్రతికూల భావాలకు దూరంగా ఉండి. రోజంతా ఆథ్యాత్మికతతో భక్తి భావనతో ఉండండి.

Updated Date - 2023-09-05T13:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising