ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna Movie : ఎన్టీఆర్‌ అభిమానుల ఆందోళన.. కృష్ణ సినిమా విడుదల!

ABN, First Publish Date - 2023-04-16T03:08:03+05:30

తన అభిమాన నటుడు హీరో కృష్ణతో ఓ భారీ సినిమా తీయాలనీ, పరిశ్రమలో అంతవరకూ లేని బడ్జెట్‌తో ఆ చిత్రం తయారు కావాలనే కోరికతో నిర్మాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన అభిమాన నటుడు హీరో కృష్ణతో ఓ భారీ సినిమా తీయాలనీ, పరిశ్రమలో అంతవరకూ లేని బడ్జెట్‌తో ఆ చిత్రం తయారు కావాలనే కోరికతో నిర్మాత రామలింగేశ్వరరావు ‘కంచుకాగడా’. తీశారు. ఎన్నాళ్లనుంచో తన మదిలో ఉన్న ఊహలకు ఓ రూపం ఇచ్చి ఈ చిత్రకథ రాయించారాయన. ‘నేటి సమాజం ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న ఊహే ఆయనతో ఈ చిత్రం తీయించింది. ‘కలర్‌ఫుల్‌ కాస్ట్లీ ఫిల్మ్‌’గా ఆ రోజుల్లో ‘కంచుకాగడా’ పేరొందింది. భారీ తారాగణం, భారీ సెట్స్‌, భారీ సాంకేతిక విలువలు.. ఒకటనేమిటి సినిమాలో అడుగడుగునా భారీతనమే కనిపిస్తుంది. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడలేదు రామలింగేశ్వరరావు ఈ చిత్రానికి ముగ్గురు రచయితలు.. సత్యమూర్తి, మహారథి, సత్యానంద్‌ పనిచేశారు. స్ర్కీన్‌పరంగా కూడా దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హీరోయిన్‌గా శ్రీదేవిని ఎంపిక చేశారు. గ్లామర్‌ క్వీన్‌గా వెలుగొందుతున్న ఆమెకు చాలా కాలం తర్వాత తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం రావడంతో ఈ చిత్రంలోని దుర్గ పాత్రను ఓ ఛాలెంజ్‌గా తీసుకొని నటించారు. డూప్‌ లేకుండా ఓ ఫైట్‌ సీన్‌లో పాల్గొని అందర్నీ ఆశ్యర్యపరిచారు శ్రీదేవి. ఒక పక్క ‘కంచుకాగడా’ షూటింగ్‌ జరుగుతుంటే మరో పక్క కృష్ణ శోభన్‌బాబు నటించే మల్టీస్టారర్‌ ‘మహాసంగ్రామం’ కూడా నిర్మాణంలో ఉండేది. రెండూ భారీ చిత్రాలే. దాంతో ఒకదాన్ని మించి మరొకటి ఉండాలని నిర్మాతలు రామలింగేశ్వరరావు తిరుపతిరెడ్డి ఖర్చు విషయంలో పోటీ పడేవారు. ఈ రెండు చిత్రాలకూ కోదండరామిరెడ్డి దర్శకుడు కావడం గమనార్హం.

భారీ ఓపెనింగ్స్‌

‘కంచుకాగడా’ కంటే ముందు నిర్మాత డూండీ నిర్మించిన ‘దొంగలు బాబోయ్‌ దొంగలు’ చిత్రం విడుదల కావాలి. అయితే ఆ సమయంలోనే ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా హీరో కృష్ణ ఊటీ నుంచి ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్‌ అభిమానుల్లో, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబికి కృష్ణ చిత్రాలు ఆడనివ్వకుండా అడ్డుకుంటామని ప్రకటించారు ఇంత గొడవ జరుగుతుంటే తన సినిమా విడుదల చేయడానికి డూండీ భయపడ్డారు. అయితే రామలింగేశ్వరరావు ధైర్యంగా ముందుకు వచ్చి ‘కంచుకాగడా’ విడుదల చేస్తామన్నారు. మా చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చెయ్యడానికి కొంతమంది ప్రయత్నించినా థియేటర్లకు భారీ సంఖ్యలో వచ్చిన కృష్ణ అభిమానుల్ని చూసి వెనక్కి తగ్గారు. ఈ సినిమా విడుదల సమయంలో విజయవాడలోని థియేటర్ల దగ్గర 144 సెక్షన్‌ను పోలీసులు విధించడం విశేషం.

Updated Date - 2023-04-16T03:08:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising