ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kitchen Tips: ఇంట్లో కుక్కర్‌తో ఇలాంటి సమస్య ఎప్పుడైనా వచ్చిందా..? విజిల్స్ అస్సలు రాకుండానే..!

ABN, First Publish Date - 2023-08-19T10:32:29+05:30

మూత చుట్టూ ఉండే రబ్బరు కూడా విజిల్స్ రాకుండా ఉండేందుకు కారణం కావచ్చు. రబ్బరు వదులుగా ఉంటే, అప్పుడు గాలి ఏర్పడదు. దీని వల్ల కుక్కర్ సరిగా విజిల్ చేయదు.

whistle of the cooker

వంట త్వరగా అవడానికి ఇప్పటి కాలంలో అంతా ఉపయోగించే వంటింటి పాత్ర కుక్కర్. కుక్కర్ లో రైస్ కడిగి పెట్టేసి ఓ మూడు విజిల్స్ రాగానే ఆపేస్తే సరి. చక్కగా పొత్తులా అన్నం ఉడికిపోయి తినడానికి రడీగా ఉంటుంది. అయితే అన్నం ఒకటే కాదు. కుక్కర్ లో చేయలేని వంట అంటూ లేదు.పప్పు, కూరల నుంచి సాంబార్, బిర్యానీల వరకూ అన్నీ చకచకా చేసేయచ్చు. అయితే కుక్కర్ వాడగా వాడగా పాతగా మారుతుంది. అప్పుడప్పుడూ కుక్కర్ మూతకున్న వాచర్ పనిచేయకపోవడం, విజిల్ వేయకపోవడం, అలాగే నీళ్ళు కారడం ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కుక్కర్ విజిల్ వేయకుండానే లోపలి పదార్థాలు ఉడికి తయారయిపోయినట్టు ఎప్పుడన్నా చూసారా..అలాంటి సమస్య వచ్చినపుడు ఏం చేయాలంటే..

వంటగదిలో పని చేస్తున్నప్పుడు, కుక్కర్‌లో విజిల్ రాకపోవడం అనేది పెద్ద సమస్య. కుక్కర్‌ విజిల్ వేయకపోవడం వల్ల తరచుగా ఆహారం మాడిపోతుంది. ఈ చిట్కాలతో కుక్కర్ విజిల్ సమస్యను పసిగట్టి, వదిలించుకోవచ్చు,. అదెలాగంటే..

కుక్కర్ వాడే ముందే..

1. కుక్కర్ విజిల్ సరిగ్గా రావాలంటే కుక్కర్ మూతను సరిగ్గా శుభ్రం చేయాలి. అందులో ఆహారం ఇరుక్కుపోతే విజిల్ సరిగా రాదు. అందువల్ల రోజూ కుక్కర్ వాడే ముందే దీనిని గమనించడం అలవాటుగా చేసుకోవాలి.

2. కుక్కర్‌ను శుభ్రం చేసినప్పుడల్లా, బ్రష్ సహాయంతో విజిల్‌ను సరిగ్గా శుభ్రం చేయండి. దీంతో కుక్కర్ సరిగ్గా విజిల్ వస్తుంది. విజిల్ రాకపోయినా పెద్ద మంటమీద వదిలేస్తే ఒక్కోసారి కుక్కర్ ఒత్తిడికి కూడా పేలిపోతుంది.

ఇది కూడా చదవండి: అందరూ తెలియక చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే.. తలకు నూనె రాసుకునేటప్పుడు చేస్తున్న ఈ 5 పొరపాట్ల వల్లే..!


3. విజిల్‌ను వేడి నీటిలో నానబెట్టి, బ్రష్ సహాయంతో పూర్తిగా శుభ్రం చేయండి. అలాగే కుక్కర్ మూతపై టిష్యూ పేపర్ ఉంచండి.

4. మూత చుట్టూ ఉండే రబ్బరు కూడా విజిల్స్ రాకుండా ఉండేందుకు కారణం కావచ్చు. రబ్బరు వదులుగా ఉంటే, అప్పుడు గాలి ఏర్పడదు. దీని వల్ల కుక్కర్ సరిగా విజిల్ చేయదు. ఇది గమనించినపుడు కుక్కర్ వాచర్ మార్చడం మంచి పని. ఇలా చేయడం వల్ల పెద్ద ప్రమాదాలను తప్పించుకున్నవారవుతారు.

Updated Date - 2023-08-19T10:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising