Iphone screen damage ; స్ర్కీన్ పగిలినా ఇబ్బందిలేదు
ABN, First Publish Date - 2023-07-21T23:32:26+05:30
ఐఫోన్‌పై ఓలెడ్ స్ర్కీన్ పాడైతే మార్చుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. లేజర్ టెక్నాలజీతో రిపెయిర్ చేసుకోవచ్చు. యూట్యూబర్ స్పేర్ పార్ట్స్ ఈ మేరకు వీడియోను విడుదల చేసింది. 2017 నుంచి ఓలెడ్ స్ర్కీన్‌ను ఐఫోన్ ఉపయోగిస్తోంది. ఓలెడ్ స్ర్కీన్ దెబ్బతింటే తొలగించాల్సిన అవసరం
‘లేజర్’తో రిపేర్ చేయొచ్చు
ఐఫోన్‌పై ఓలెడ్ స్ర్కీన్ పాడైతే మార్చుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. లేజర్ టెక్నాలజీతో రిపెయిర్ చేసుకోవచ్చు. యూట్యూబర్ స్పేర్ పార్ట్స్ ఈ మేరకు వీడియోను విడుదల చేసింది. 2017 నుంచి ఓలెడ్ స్ర్కీన్‌ను ఐఫోన్ ఉపయోగిస్తోంది. ఓలెడ్ స్ర్కీన్ దెబ్బతింటే తొలగించాల్సిన అవసరం లేదని, లేజర్ టెక్నాలజీతో మరమ్మతు చేసుకోవచ్చని ఆ వీడియో ద్వారా తెలిసింది. ఇది ఫస్ట్ జనరేషన్ మెషీన్. దీన్ని మరింత మెరుగుపర్చాల్సి ఉందని ఆ మెషీన్‌ను రూపొందించిన వారు చెబుతున్నారు. స్ర్కీన్ పగిలితే, లైన్లు ఏర్పడతాయి. వాటిని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. క్లిష్టత అంతా ఆ పొరల్లో ఇమిడి ఉంటుంది. రిపెయిర్‌కు సమయం పడుతుంది. అయితే లేజర్ సాంకేతికతతో ఆ లైన్లు మటుమాయం అవుతాయని చెబుతున్నారు. ఈ మెషీన్ ధర 12000 డాలర్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
Updated Date - 2023-07-21T23:32:47+05:30 IST