ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Google Play Store Cricket games: గూగుల్‌ ప్లే స్టోర్‌లో క్రికెట్‌ గేమ్స్‌

ABN, First Publish Date - 2023-06-10T00:55:18+05:30

క్రికెట్‌ అనేది భారతేదేశంలో ఎప్పుడో ఆట స్థాయిని దాటిపోయింది. యూత్‌లో అయితే సర్వం క్రికెట్‌నే. అది గల్లీ క్రికెట్‌ అయినా, ఐపిఎల్‌ అయినా అభిమానం అంతే స్థాయిలో ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రికెట్‌ అనేది భారతేదేశంలో ఎప్పుడో ఆట స్థాయిని దాటిపోయింది. యూత్‌లో అయితే సర్వం క్రికెట్‌నే. అది గల్లీ క్రికెట్‌ అయినా, ఐపిఎల్‌ అయినా అభిమానం అంతే స్థాయిలో ఉంటుంది. మొబైల్‌ ఆటల్లో కూడా క్రికెట్‌కు ఆదరణ ఎక్కువే. సిమ్యులేషన్‌ నుంచి ఆర్కేడ్‌ వరకు ఆండ్రాయిడ్‌లో వేర్వేరు తరహా క్రికెట్‌ గేమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. గూగుల్‌ ప్లే స్టోర్‌ హోమ్‌ పేజీలోనే ఇవి కనిపిస్తాయి. వీటన్నింటినీ ఉచితంగా ఆడుకోవచ్చు.

రియల్‌ క్రికెట్‌ 20: వన్‌ వెర్సస్‌ వన్‌, టు వెర్సస్‌ టు మోడ్‌లో దీన్ని ఆడుకోవచ్చు. టీమ్‌గాను ఒకరు ఇంకొకరితో కోఆపరేటివ్‌ మోడ్‌లో ఎఐకి వ్యతిరేకంగానూ ఆడొచ్చు.

రియల్‌ క్రికెట్‌ 22: ప్రీవియస్‌ ఎంట్రీలో వేర్వేరు మోడ్స్‌లో గేమ్స్‌ అందుబాటులో ఉండేవి. మెరుగుపర్చిన యానిమేషన్స్‌, టెక్చర్స్‌ని వాటికి జోడించారు.

సచిన్‌ సాగా క్రికెట్‌ చాంపియన్స్‌: పేరుకు తగ్గట్టే కాంపైయిన్‌, టోర్నమెంట్‌, పీవీపీ మోడ్స్‌ ఇందులో ఉంటాయి. ఆట లక్ష్యాన్ని ఛేదించగలిగితే ఇన్‌-గేమ్‌ రివార్డ్స్‌ కూడా ఉంటాయి.

హిట్‌ వికెట్‌: ఇదో ఆర్కైడ్‌ స్టయిల్‌ క్రికెట్‌ గేమ్‌. ఆన్‌లైన్‌లోనే ఇతర క్రీడాకారులకు వ్యతిరేకంగా లీడర్‌ బోర్డు స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.

క్రికెట్‌ లీగ్‌: షార్ట్‌ ఫార్మేట్‌ మ్యాచ్‌లను ఇది అందిస్తుంది. మంచి ఆటగాళ్ల కోసం, కస్టమ్‌ క్రికెట్‌ టీమ్‌ ఏర్పాటు కోసం అన్‌లాక్‌ చేసే విధంగా ఆడాల్సి ఉంటుంది.

వరల్డ్‌ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ 3: మ్యాచ్‌లకు సంబంధించి ఇందులో భిన్నమైన కేటలాగ్స్‌ ఉంటాయి. ఓడీఐ/ టెస్ట్‌ సిరీస్‌, ట్రై సిరీస్‌, టోర్నమెంట్స్‌ వంటివి చాలా ఉంటాయి.

Updated Date - 2023-06-10T00:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising